Shrimp Cultivation : వర్షాకాలంలో రొయ్యల సాగుకు పొంచి వున్న వ్యాధుల ముప్పు

అధిక వర్షాలు, ఎండలతో, తీవ్ర వాతావరణ ఒడిదుడుకుల మధ్య సాగు కొనసాగుతుంది. కనుక తరచూ రొయ్యలు ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. పైగా చెరువులకు కొత్తనీరు ఎక్కువ పెడతారు కనుక, వివిధ హానికారక క్రిములు, బాక్టీరియా, వైరస్ ల బెడద ఎక్కువ వుంటుంది.

Shrimp Cultivation : వర్షాకాలంలో రొయ్యల సాగుకు పొంచి వున్న వ్యాధుల ముప్పు

Shrimp Cultivation

Shrimp Cultivation : దినదినాభివృద్ధి చెందుకున్న ఆక్వారంగంలో, సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్ లో వివిధ బాక్టీరియా వైరస్ వ్యాధుల దాడి కల్చర్ ను అతలాకుతలం చేస్తోంది. వర్షాకాలంలో చేపట్టే కల్చర్ లో వాతావరణ ఒడిదుడుకులు తీవ్రంగా వుండటంతో ఈ సమస్యల తీవ్రత మరింత పెరుగుతోంది. తగిన ముందు జాగ్రత్తలు చేపట్టడం ద్వారానే ఈ సమస్యలను అధిగమించేందుకు అవకాశం వుంటుందని మత్స్య శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వర్షాకాలంలో తక్కువ సంఖ్యలో రొయ్య పిల్లను వదలాలని సూచిస్తున్నారు. వివరాలు చూద్దాం.

READ ALSO : Korra Cultivation : అండు కొర్రల సాగులో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు

దేశంలో రొయ్య కల్చర్ కు పేరెన్నికగన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుతోంది. దేశంలోని రొయ్య ఉత్పత్తిలో ఏపీ వాటా 50 శాతంకు పైగా వుండటం విశేషం. రొయ్యల సాగును అన్ని కాలాల్లో చేపడుతున్నా… వర్షాకాలం మాత్రం ఈ కల్చర్ కు అత్యంత గడ్డుకాలంగా చెబుతారు.

అధిక వర్షాలు, ఎండలతో, తీవ్ర వాతావరణ ఒడిదుడుకుల మధ్య సాగు కొనసాగుతుంది. కనుక తరచూ రొయ్యలు ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. పైగా చెరువులకు కొత్తనీరు ఎక్కువ పెడతారు కనుక, వివిధ హానికారక క్రిములు, బాక్టీరియా, వైరస్ ల బెడద ఎక్కువ వుంటుంది.

READ ALSO : Dried Shrimps : ఎండు రొయ్యలు ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదు తెలుసా?

అందువల్ల వర్షాకాలంలో కల్చర్ ను సాధ్యమైనంత తగ్గించుకుని, చెరువులో తక్కువ సాంద్రతలో పిల్ల వదలాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఎమ్. వీరభద్ర రావు.

సాధారణంగా వనామి రొయ్యల్లో తెల్లమచ్చ వైరస్ రైతుకు ప్రధాన సమస్యగా వుంది. రొయ్య పిల్లలో నాణ్యత లోపించినప్పుడు, పంట తొలిదశలోనే  ఈ వైరస్ బారిన పడే అవకాశం వుంటుంది. అలాగే పక్క చెరువుల నుండి లేదా కాలువల నుండి కొత్త నీరు పెట్టినప్పుడు, వైరస్ సోకే ప్రమాదం వుంటుంది.

READ ALSO : Shrimp Diseases : నల్లబెల్లంతో.. రొయ్యల వ్యాధులకు చెక్

ఇలాంటి సందర్భాల్లో చాలామంది రైతులు యాజమాన్యం సక్రమంగా చేపట్టినప్పటికీ వైరస్ ను అధిగమించలేని సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. వైరస్ కు నివారణ లేదు కనుక నిరోధించటం ఒక్కటే మార్గం అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే వర్షాకాలంలో వైట్ గట్, ఇ.హెచ్.పి వంటి వ్యాధుల నివారణకు మేలైన యాజమాన్యం పాటించాలి.