Fish Farming Tips : తెల్లచేపల పెంపకంలో మేలైన జాగ్రత్తలు
ఎకరానికి 2 వేల నుంచి 2,500 పిల్లను వదులుతున్నారు. వీటితోపాటు చెరువు అడుగుభాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో రెండంగుళాల సైజులో అంటే ఫింగర్ లింగ్ దశలో చేప పిల్ల వదిలేవారు.

Fish Farming Tips
Fish Farming Tips : ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం అధికంగా వుంది. ముఖ్యంగా అధిక మార్కెట్ డిమాండ్ వున్న కార్ప్ జాతి అయిన, కట్ల, రోహు , శీలావతి చేపలను వ్యాపార సరళిలో విస్తారంగా సాగుచేస్తున్నారు. అయితే వీటి పంటకాలం 8 నుండి 12 నెలల సమయం పడుతుంది.
READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు
అన్ని కాలాలు ఇందులో ఉండటంతో రైతులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. అధిక దిగుబడిని సాధించవచ్చో తెలియజేస్తున్నారు ఉండి మత్స్యపరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. తంబిరెడ్డి నీరజ.
మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గంతలో కంటే అధికంగా పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకొని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే, చేపల పెంపకంలో ఆదాయం తక్కువ వున్నా, స్థిరమైన రాబడి వుండటం, నష్ట భయం తక్కువ వుండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగుచేస్తున్నారు.
READ ALSO : Sameekrutha Vyavasayam : కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంచుతున్న ఏలూరు జిల్లా రైతు
ఎకరానికి 2 వేల నుంచి 2,500 పిల్లను వదులుతున్నారు. వీటితోపాటు చెరువు అడుగుభాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో రెండంగుళాల సైజులో అంటే ఫింగర్ లింగ్ దశలో చేప పిల్ల వదిలేవారు. ఈ పంట వచ్చేందుకు 12 నెలల సమయం పట్టేది. ప్రస్థుతం జీరో పాయింట్లు అంటే 180 నుంచి 250 గ్రాముల సైజులో పిల్లలను వదులుతున్నారు. దీనివల్ల కల్చర్ పంటకాలం తగ్గి రెండేళ్లకు 3 నుంచి 4 పంటలు తీసే అవకాశం ఏర్పడింది.
ఈ కల్చర్ కు కూలీల అవసరం తక్కువగా వుండటం వల్ల, రైతుకు రిస్కు తగ్గుతోంది. సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతీ పంటలోను 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధిస్తున్నారు. అయితే ఈసాగు అన్ని కాలాల సాగుతుండటంతో రైతులు ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
READ ALSO : Eat Dried Fish : అధిక రక్తపోటు ఉన్నవారు ఎండు చేపలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వాతావరణంలోని తీవ్ర హెచ్చుతగ్గులు, తరచూ చెరువు నీటి ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చెరువుల్లో తరచూ ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. చేపలు ఒత్తిడికి లోనవటం వల్ల వివిధ వ్యాధులబారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చేపజాతుల పెంపకం చేపడుతున్నారు. అయితే చేపల చెరువుల్లో ఎలాంటి జాగ్రత్తల చేపడితే మంచి దిగుబడిని తీసుకోవచ్చో తెలియజేస్తున్నారు ఉండి మత్స్యపరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. తంబిరెడ్డి నీరజ.