Home » Rice Varieties
అధికంగా దీర్ఘ, మధ్యదీర్థకాలిక వరి రకాలను సాగుచేస్తుంటారు. దీర్ఘకాలిక రకాల పంటకాలం 140 నుండి 155 రోజులు. మధ్య కాలిక రకాల పంటకాలం 125 నుండి 135 రోజులు వుంటుంది. సాగు నీటి వసతి, మార్కెట్ గిరాకీని దృష్టిలో వుంచుకుని, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట�
తెలంగాణలో ప్రతి ఏటా లక్షా నుండి లక్షా 20 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఖరీఫ్ లో దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో సాగవుతూ ఉంటుంది. అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు .
కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. తక్కువకాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో వున్నాయి.
సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు.