Home » Tauktae Cyclone
కరోనా గుప్పిట్లో చిక్కుకున్న భారత్‌ను వణికిస్తున్న మరో ప్రమాదం
తౌక్టే తుఫాన్ మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో కల్లోలం రేపగా ప్రధాని మోడీ బుధవారం కేవలం గుజరాత్ లోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం పట్ల శివసేన విమర్శలు గుప్పించింది.
తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, దీవ్ దమన్ లో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు.
తౌటే తుఫాన్ ప్రభావంతో కేరళ, కర్ణాటక మహారాష్ట్ర, గుజరాత్ లలో భారీ వర్షాలు కురిశాయి. ముంబై మహానగరంలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా అనేక చోట్ల రోడ్లు కోతకు గురి కాగా, రైలు పట్టాలు కొట్టుకుపోయాయి.
అరేబియా సముద్రంలో భీకర తుపాను ‘తౌక్టే’ ప్రభావం తెలంగాణపై పడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మంగళవారం ఉదయం (మే 18) నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. తుపాను రూపంలో ప్రకృతి దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.