Tauktae Cyclone : కరోనాకు తోడు భారత్‌కు మరో ముప్పు.. ప్రకృతి విపత్తు ముంచుకొస్తోంది..

ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. తుపాను రూపంలో ప్రకృతి దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్‌ ఇచ్చింది.

Tauktae Cyclone : కరోనాకు తోడు భారత్‌కు మరో ముప్పు.. ప్రకృతి విపత్తు ముంచుకొస్తోంది..

Another Natural Disaster May Hit As Cyclone In India

Updated On : May 12, 2021 / 12:06 PM IST

Tauktae Cyclone may Hit India : ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. తుపాను రూపంలో ప్రకృతి దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్‌ ఇచ్చింది.



ఏల్లుండి నాటికి అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. బలపడిన అల్పపీడనం క్రమంగా తుపానుగా మారే ఛాన్స్‌ ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించింది.

ఈ తుఫాన్‌కు ‘తౌక్టే’ అని పేరు పెట్టారు. ఒకవేళ ఇది భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది దేశంలో ఇదే మొదటి తుఫాన్ అవుతుందన్నారు. దీని ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఈ నెల 14 నుంచి సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.



తుఫాన్ ప్రభావంతో మాల్దీవులు, లక్షద్వీప్‌లలో గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే వారాంతంలో ఇక్కడి సముద్రంలో ఒక మీటరు ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది.