Home » Tollywood actress gallery
నారా రోహిత్ నటించిన ప్రతినిథి సినిమాలో హీరోయిన్‌గా నటించింది కన్నడ భామ శుబ్రా అయ్యప్ప. తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించినా ఎక్కడా లక్ కలిసిరాలేదు.
అప్పుడెప్పుడో కొన్ని సినిమాల్లో నటించిన రాయ్ లక్ష్మి.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో ప్ర్తత్యేక గీతాలలో కూడా చిందేసింది. ఈ మధ్య కాలంలో రత్తాలు సోషల్ మీడియా ద్వారా హల్చల్ చేస్తుంది.
ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే చాలా ఇమేజ్ సంపాదించుకుంది నిధి అగర్వాల్. రెండు భాషల్లో వరస సినిమాలతో దూసుకుపోతున్న నిధి అగర్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శుద్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్ ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఏమాత్రం తీరిక ఉన్నా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట సినీ పరిశ్రమలోకి వచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో కల్యాణ్ రామ్ మూవీ విజయదశమి ద్వారా తెరంగ్రేటం చేసిన వేదిక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.
స్టార్ డమ్ అంతగా లేకపోయినా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చింది అనైకా సోతీ. వర్మ సత్య 2తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహానీ శర్మ 2017లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం కనిపించిన ఈమె మోడల్ కూడా.
వరస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిన దిశాపటాని తెలుగులో లోఫర్ సినిమాతో అరంగేట్రం చేసింది. బాలీవుడ్ మీద ఫోకస్ పెంచిన దిశా అక్కడ వరస సినిమాలను పట్టేస్తుంది.
హీరోయిన్‌గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్‌డమ్ సంపాదించుకుంది.
శర్వానంద్.. సుజిత్ కాంబినేషన్లో వచ్చిన రన్ రజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమైంది ముంబై భామ సీరత్ కపూర్.