Apple CEO Tim Cook: కుక్‌ జీతం రూ.5,529కోట్లు

గ్లోబ‌ల్ టెక్నో దిగ్గజం ఆపిల్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ హ‌యాంలో సంస్థ అత్యంత విలువైన కంపెనీగా అవ‌త‌రించింది.

Apple CEO Tim Cook: కుక్‌ జీతం రూ.5,529కోట్లు

Cook

Apple CEO Tim Cook: గ్లోబ‌ల్ టెక్నో దిగ్గజం ఆపిల్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ హ‌యాంలో సంస్థ అత్యంత విలువైన కంపెనీగా అవ‌త‌రించింది. ఆపిల్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ 2 ల‌క్షల కోట్ల డాల‌ర్ల పైగానే చేరుకుంది. ఆపిల్ M-క్యాప్‌ ప్రపంచ దేశాల జీడీపీలో 97 శాతం ఉండొచ్చున‌ని అంచ‌నా. ఈ ఏడాది 12 శాతం వృద్ధితోపాటు ఆపిల్ షేర్లు 11వందల శాతం పెరిగాయి.

2011లో ప‌దేళ్ల కాంట్రాక్ట్‌పై సంత‌కం చేశారు టిమ్ కుక్‌.. లేటెస్ట్‌గా చివ‌రి వేత‌న చెల్లింపులు అందుకున్నారు. 2011లో సీఈవోగా బాధ్యత‌లు స్వీక‌రించిన టిమ్ కుక్‌కు చివ‌రి, 10వ వేత‌నంగా సుమారు 5వేల 529కోట్ల విలువైన 50 ల‌క్షల షేర్లను ఆపిల్ సంస్థ కేటాయించింది‌. గ‌త మూడేళ్లుగా ఆపిల్ పురోగ‌తిలో ప‌నితీరుకు గుర్తింపుగా టిమ్ కుక్ ఈమేరకు జీతాన్ని అందుకున్నారు.

త‌న ప‌నితీరుతో సంస్థ పురోభివృద్ధిలో కీల‌కంగా వ్యవ‌హ‌రించారు టిమ్ కుక్‌. అందుకుగాను కుక్‌ను బిలియ‌నీర్‌గా తీర్చిదిద్దింది ఆపిల్. ఆయ‌న నిక‌ర ఆస్తి 1.5 బిలియ‌న్ల డాల‌ర్లు కాగా.. 2011లో ఆపిల్ సీఈవోగా బాధ్యత‌లు స్వీక‌రించే నాటికి కుక్ శ‌క్తి సామ‌ర్థ్యాల‌పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. స్టీవ్ జాబ్స్ ఆకాంక్షల‌ను నెర‌వేరుస్తారా? లేదా? అనే అనుమానాలు మార్కెట్ వర్గాల్లో వినిపించాయి. వారి సందేహాల‌ను క్లియర్ చేస్తూ ఆపిల్ రెవెన్యూను రెట్టింపు చేశారు టిమ్‌ కుక్‌. 2011 ఆగ‌స్టులో స్టీవ్ జాబ్స్ అక‌స్మిక మ‌ర‌ణం త‌ర్వాత ఆపిల్ సీఈవోగా టిమ్‌కుక్ బాధ్యత‌లు చేపట్టారు.

పదేళ్ల వ్యవధిలో టిమ్ సాధించిన విజయ పరంపరల్లో బీట్స్ మరియు ఇంటెల్ మోడెమ్ యూనిట్, ఆపిల్ వాచ్ వంటి వస్తువుల పరిచయం.. ఐప్యాడ్‌లు మరియు ఐఫోన్‌ల ఉత్పత్తిలో విశిష్ట విస్తరణ. కస్టమ్ చిప్‌లు మరియు టెక్నాలజీలను తయారు చేయడంలో కంపెనీ చొచ్చుకుపోవడంలో ముఖ్యమైన పాత్రను పోషించారు.