Best Mobile Phones : ఈ మే 2024లో భారత్‌లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Best Mobile Phones May 2024 : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మే 2024లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల అద్భుతమైన 5జీ స్మార్ట్‌‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.

Best Mobile Phones : ఈ మే 2024లో భారత్‌లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Best Mobile Phones under Rs 25k ( Image Credit : Google )

Updated On : May 4, 2024 / 4:18 PM IST

Best Mobile Phones May 2024 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? భారత మార్కెట్లో రూ. 25వేల లోపు కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లలో అన్ని యాప్‌లు, గేమ్‌ల కోసం పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లు ఉన్నాయి. వీడియోలను చూసేందుకు అద్భుతమైన స్క్రీన్‌లు, మంచి కెమెరాలు ఉన్నాయి. ఈ మేలో మీరు భారత్‌లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో నథింగ్ ఫోన్ 2ఎ, మరో 3 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Read Also : Apple iPhone 14 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్!

నథింగ్ ఫోన్ 2ఎ :
నథింగ్ ఫోన్ (2a) స్పెషల్ డిజైన్‌తో రూ. 25వేల కన్నా తక్కువ ధరల విభాగంలో అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ మృదువైన 120హెచ్‌జెడ్ అమోల్డ్ స్క్రీన్, క్లీన్, సింపుల్ నథింగ్ ఓఎస్ 2.5 సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. రూ. 23,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్ గొప్ప ఆల్ రౌండర్. నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ ప్రస్తుతం వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లు కాకుండా కొత్త బ్లూ కలర్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

వన్‌‌ప్లస్ నార్డ్ సీఈ4 5జీ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫోన్ గత జనరేషన్ నార్డ్ సీఈ3కు అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్ 120హెచ్‌జెడ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 2,160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ కలిగి ఉంది. మీ వేళ్లు లేదా స్క్రీన్ తడిగా ఉన్నప్పుడు ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 5,500ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఉంది.

మీరు బాక్స్‌లో ఛార్జర్‌ని బండిల్‌గా పొందవచ్చు. అదనంగా, మీరు ఆండ్రాయిడ్ 14లో సరికొత్త ఆక్సిజన్‌ఓఎస్ సాఫ్ట్‌వేర్‌ను 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా, స్టైలిష్ కొత్త డిజైన్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 ప్రారంభ ధర రూ. 24,999కు పొందవచ్చు. వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

పోకో X6 5జీ ఫోన్ :
సరసమైన మిడ్ రేంజ్ విభాగంలో పోకో ఎక్స్6 5జీ స్పీడ్‌తో వస్తుంది. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 12జీబీ ర్యామ్, గేమింగ్ నుంచి మల్టీ టాస్కింగ్ వరకు ఫోన్ హ్యాండిల్ చేయగలదు. 120హెచ్‌జెడ్ అమోల్డ్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 5,100ఎంఎహెచ్ బ్యాటరీ ఛార్జ్‌పై ఒక రోజంతా వస్తుంది. టాప్ అప్ కోసం 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. రూ. 25వేల లోపు ధరలో పోకో X6 కొనుగోలు చేయగల మరో బెస్ట్ అని చెప్పవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 40 నియో :
మోటోరోలా ఎడ్జ్ 40 నియో 5జీ ఫోన్ రూ. 25వేల కన్నా తక్కువ ధర విభాగంలో సరసమైన స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఈ మిడ్ రేంజ్ ఫోన్ వీడియోలు, గేమింగ్‌ల కోసం 144హెజెడ్ పోల్డ్ కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ సైజు, వేగన్ తోలుతో పట్టుకునేలా చాలా సౌకర్యంగా ఉంటుంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 68డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. తక్కువ వెలుతురులో కూడా ఇందులోని కెమెరా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. మొత్తంమీద, రూ. 25వేల లోపు మోటోరోలా ఎడ్జ్ 40 నియో బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

Read Also : iPhone 16 Series Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. ధర, డిజైన్, డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు లీక్..!