Facebook: ఫేస్‌బుక్ మారిపోతుంది.. నవంబరులో కొత్త పేరుతో!!

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం.. ఫేస్‌బుక్ పేరు మార్చుకుని రాబోతున్నట్లు The Verge అనే మీడియా వెల్లడించింది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఈ మేర ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Facebook: ఫేస్‌బుక్ మారిపోతుంది.. నవంబరులో కొత్త పేరుతో!!

Facebook

Facebook: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం.. ఫేస్‌బుక్ పేరు మార్చుకుని రాబోతున్నట్లు The Verge అనే మీడియా వెల్లడించింది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఈ మేర ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 28న జరిగే వార్షిక సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని ఖరారు చేయనున్నారు.

అమెరికా ప్రభుత్వం నుంచి వ్యాపార లావాదేవీలకు మాత్రమే ఉపయోగపడుతుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. పేరు మారిన తర్వాత ఫేస్‌బుక్ అనే పేరెంటింగ్ కంపెనీ తరపున కొత్త కంపెనీ పనిచేస్తుందన్నమాట. అంటే ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ఒక్యూలస్ లాంటి వాటితో పాటు ఫేస్‌బుక్ కొత్త కంపెనీ సమానంగా వ్యవహరిస్తుంది.

ఫేస్‌బుక్ వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్)లలో భారీగా పెట్టుబడులు పెట్టింది. వీటి ద్వారా పలు డివైజ్ లలో, యాప్ లలో మూడు బిలియన్ యూజర్లతో కనెక్ట్ అవ్వొచ్చు. ఈ మేర మంగళవారం యురోపియన్ యూనియన్ లో మరో ఐదేళ్లలో 10వేల జాబ్స్ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తుంది.

………………………………………….. : నిర్మాతగా కాజల్.. కొత్త హీరోతో ప్రయోగం..