WhatsApp GhostPairing : వాట్సాప్ యూజర్లకు CERT-In హెచ్చరిక.. ‘ఘోస్ట్ పెయిరింగ్’తో జాగ్రత్త.. ఈ హ్యాకింగ్ ట్రిక్‌తో మీ ఖాతా క్షణాల్లో ఖాళీ..!

WhatsApp GhostPairing : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. నిమిషాల్లో మీ అకౌంట్ ఖాళీ చేసే కొత్త హ్యాకింగ్ ట్రిక్ గురించి CERT-In హెచ్చరిక జారీ చేసింది. సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలంటే?

WhatsApp GhostPairing : వాట్సాప్ యూజర్లకు CERT-In హెచ్చరిక.. ‘ఘోస్ట్ పెయిరింగ్’తో జాగ్రత్త.. ఈ హ్యాకింగ్ ట్రిక్‌తో మీ ఖాతా క్షణాల్లో ఖాళీ..!

WhatsApp GhostPairing

Updated On : December 22, 2025 / 1:40 PM IST

WhatsApp GhostPairing : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ వాట్సాప్ అకౌంట్ భద్రమేనా? వాట్సాప్ యూజర్లకు CERT-In హెచ్చరిక జారీ చేసింది. హ్యాకర్లు వాట్సాప్ యూజర్ల అకౌంట్లను హ్యాక్ చేసేందుకు డివైజ్ లింకింగ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. దీన్నే ఘోస్ట్ పెయిరింగ్ పేరుతో పిలుస్తారు.

ఈ కొత్త హ్యాకింగ్ యాక్టివిటీకి పాస్‌వర్డ్ లేదా సిమ్ స్వాప్ (WhatsApp GhostPairing) అవసరం లేదు. హ్యాకర్లు రియల్-టైమ్ మెసేజ్ రీడ్ చేయగలరు. ఫోటోలు, వీడియోలను వీక్షించగలరు. కాంటాక్ట్‌లకు మెసేజ్ పంపగలరు. ఈ ఘోస్ట్ పెయిరింగ్ వెరీ డేంజరస్.. సైబర్ నేరస్థులు పాస్‌వర్డ్‌లు లేదా SIM ఎక్స్ఛేంజ్ అవసరం లేకుండానే వాట్సాప్ అకౌంట్లను పూర్తిగా కంట్రోల్ చేయొచ్చునని CERT-In తెలిపింది.

వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఆన్‌లైన్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లను రాబోయే కొన్ని నెలల్లో యూజర్ అకౌంట్లకు సిమ్ బైండింగ్‌ను తప్పనిసరి చేయాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఆదేశించింది. దాదాపు నెల తర్వాత వాట్సాప్ అకౌంట్ టేకోవర్ క్యాంపెయిన్‌పై CERT-In అడ్వైజరీ వచ్చింది. వినియోగదారులు తమ అకౌంట్లకు లింక్ చేసిన యాక్టివ్ సిమ్‌ లేని డివైజ్‌ల్లో ఈ యాప్‌లను యాక్సెస్ చేయలేరు.

వాట్సాప్ వెబ్ అకౌంట్లు ప్రతి 6 గంటలకు లాగ్ అవుట్ అవుతాయి. QR కోడ్‌ల ద్వారా యూజర్ల అకౌంట్లను తిరిగి లింక్ చేయాల్సి ఉంటుంది. పెరుగుతున్న డిజిటల్ మోసాన్ని, ముఖ్యంగా వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లలో బాధితుల అకౌంట్లను హైజాక్ చేయడం ద్వారా జరిగే మోసాలను అరికట్టడానికి DoT SIM-బైండింగ్ అమల్లోకి తీసుకొస్తుంది.

ఘోస్ట్ పెయిరింగ్ ఏంటి? ఎలా చేస్తారంటే? :
ఈ ఘోస్ట్ పెయిరింగ్ అనేది “హాయ్, ఈ ఫోటోను చెక్ చేయండి” వంటి ఫేస్‌బుక్ తరహా లింక్‌ను కలిగిన మెసేజ్‌తో ప్రారంభమవుతుంది. లింక్‌ను క్లిక్ చేయడం వలన వెరిఫికేషన్ కోసం మీ ఫోన్ నంబర్‌ను అడిగే ఫేక్ ఫేస్‌బుక్ పేజీ ఓపెన్ అవుతుంది.

Read Also : Excellent Android Phones : ఐఫోన్ కన్నా ఆండ్రాయిడ్ ఫోన్లే బెటర్ భయ్యా.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను తలదన్నేలా 5 ఆండ్రాయిడ్ ఫోన్లు..!

మీ నంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత హ్యాకర్ డివైజ్ పెయిరింగ్ కోడ్‌కు లింక్ చేస్తుంది. తద్వారా హ్యాకర్లకు మీ డివైజ్ పూర్తి కంట్రోల్ అనుమతిస్తుంది. తద్వారా వాట్సాప్ అకౌంటులో ఏం జరిగేది మీకు తెలియదు.. హిడెన్ యాక్టివిటీతో బ్యాక్ గ్రౌండ్‌లోనే పనిచేస్తుంది. మెసేజ్ పంపిన తర్వాత మాత్రమే యూజర్లకు తెలుస్తుంది.

హ్యాకర్లు ఏం చేస్తారంటే? :

మీ ఫోన్ లేదా ఇతర డివైజ్‌లను లింక్ చేసిన తర్వాత హ్యాకర్లు గత, రీసెంట్ మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్‌లను చూడగలరు. మీ పేరుతో గ్రూపులు, కాంటాక్టులకు మెసేజ్ లను పంపగలరు. ఇదంతా మీ ఫోన్ బ్యాక్ గ్రౌండ్‌లోనే జరుగుతుంది కాబట్టి యూజర్లకు తమ ఫోన్లలో ఏం జరుగుతుందో తెలియదు. హ్యాక్ అయిన అకౌంట్ల నుంచి కొత్త మెసేజ్‌లను ఇతరులకు పంపడం ద్వారా ఈ గోస్ట్ పెయిరింగ్ క్రియేట్ అవుతుంది.

ఘోస్ట్ పెయిరింగ్ కట్టడి చేసే మార్గాలు ఏంటి? :
అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీకు తెలిసిన కాంటాక్ట్‌ల నుంచి ఫోన్ నంబర్‌లను ఎంటర్ చేయవద్దు. వాట్సాప్‌లో లింక్డ్ డివైసెస్ సెక్షన్ చెక్ చేసి గుర్తుతెలియని డివైజ్‌లను నుంచి లాగ్ అవుట్ చేయండి. టూ ఫ్యాక్టర్డ్ వెరిఫికేషన్ కూడా ఆన్‌లో ఉంచండి. అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేయండి. మీ అకౌంట్ హ్యాక్ అయితే సైబర్ సెల్, వాట్సాప్ సపోర్టు కోసం రిపోర్టు చేయండి.

వాట్సాప్ యూజర్లు ఇలా చేయొద్దు :
ఘోస్ట్ పెయిరింగ్ అనే కొత్త వాట్సాప్ హ్యాకింగ్ క్యాంపెయిన్ గురించి CERT-In హెచ్చరించింది. ఫేక్ లింక్‌లను పంపడం ద్వారా తెలిసిన కాంటాక్టుల నుంచి ఫోన్ నంబర్‌లను పొంది హ్యాకర్లు అకౌంట్లను లింక్ చేస్తారు. లింక్ చేసిన తర్వాత మీరు ఎవరికీ తెలియకుండా మెసేజ్, ఫోటోలు, వీడియోలు మొదలైన వాటిని చూడవచ్చు. ఇతరులకు పంపవచ్చు.

మీరు సేఫ్ గా ఉండాలంటే అనుమానాస్పద లింక్‌లను ఓపెన్ చేయొద్దు. టూ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ కూడా ఆన్‌లో ఉంచండి. ఒకవేళ హ్యాకింగ్ జరిగితే.. లింక్ చేసిన డివైజ్ వెంటనే చెక్ చేసి సైబర్ సెల్‌కు రిపోర్ట్ చేయండి.