Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్.. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అతి త్వరలో వార్షిక బిగ్ బిలియన్ డేస్ సేల్‌ (Flipkart Big Billion Days Sale)ను సెప్టెంబర్ 23 నుంచి నిర్వహించేందుకు రెడీగా ఉంది. ఈ బిగ్ ఫెస్టివల్ సేల్‌కు ముందుగానే ఫ్లిప్‌కార్ట్ కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్‌లను వెల్లడించింది.

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్.. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Flipkart Big Billion Days sale Big discounts on Samsung Galaxy S22+, Galaxy F23 5G, and more

Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అతి త్వరలో వార్షిక బిగ్ బిలియన్ డేస్ సేల్‌ (Flipkart Big Billion Days Sale)ను సెప్టెంబర్ 23 నుంచి నిర్వహించేందుకు రెడీగా ఉంది. ఈ బిగ్ ఫెస్టివల్ సేల్‌కు ముందుగానే ఫ్లిప్‌కార్ట్ కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్‌లను వెల్లడించింది. ప్రతిరోజూ కొత్త బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ డీల్‌లను రివీల్ చేస్తోంది. కొన్ని శాంసంగ్ ఫోన్ డీల్స్ కూడా వెల్లడించింది. అందులో సౌత్ కొరియన్ దిగ్గజం (Samsung) నుంచి Samsung Galaxy S22+, Galaxy S23 5G వంటి ప్రముఖ ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ తమ ప్లాట్ ఫాంపై భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది.

Flipkart Big Billion Days sale Big discounts on Samsung Galaxy S22+, Galaxy F23 5G, and more(1)

Flipkart Big Billion Days sale Big discounts on Samsung Galaxy S22+, Galaxy F23 5G,

లేటెస్ట్ 5G ఫోన్ డీల్‌లలోకి ప్రవేశించే ముందు.. డిస్కౌంట్ ఆఫర్‌లు ఫ్లాట్ డిస్కౌంట్‌లపై మాత్రమే కాదు.. బ్యాంక్ కార్డ్, ఎక్స్ఛేంజ్, ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లు కూడా ఉంటాయని గుర్తించాలి. అయితే దీనికి సంబంధించిన వివరాలు సేల్ సమయంలోనే Flipkart వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ఈవెంట్‌కు ముందు ధర సేల్ ధరలను ధృవీకరించింది.

Flipkart Big Billion Days sale Big discounts on Samsung Galaxy S22+, Galaxy F23 5G, and more

Flipkart Big Billion Days sale Big discounts on Samsung Galaxy S22+, Galaxy F23 5G

శాంసంగ్ ఫోన్‌లపై భారీ తగ్గింపు :
ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయిన Samsung Galaxy F23 5G ధర రూ.10,999కి అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 17,499కి అందుబాటులోకి వచ్చింది. అంటే.. ప్రాథమికంగా ఫ్లిప్‌కార్ట్ రూ. 6,500 డిస్కౌంట్ అందించనుంది. సరసమైన ధరలో ఫోన్ కోరుకునే యూజర్లు Samsung Galaxy F13ని కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ రూ. 8,499కి అందుబాటులో ఉంటుంది. Samsung ప్రీమియం Galaxy S22+ రూ. 59,999కే అందుబాటులో ఉంటుంది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో రూ. 84,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉండనుంది.

Flipkart Big Billion Days sale Big discounts on Samsung Galaxy S22+, Galaxy F23 5G, and more

Flipkart Big Billion Days sale Big discounts on Samsung Galaxy S22+, Galaxy F23 5G

ఈ డివైజ్ ఇప్పటికే రూ.77,970 తగ్గింపు ధరతో సేల్‌కు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో వినియోగదారులు రూ.60వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, Samsung Galaxy S21 FE 5G ఫోన్.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రూ. 49,999కి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో గత ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 888 SoCతో వచ్చిన ఈ 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ. 31,999కి అందుబాటులో ఉండనుంది.

Read Also : Flipkart Big Billion Days: ఐఫోన్లపై ఫ్లిప్‭కార్ట్ క్రేజీ ఆఫర్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెడతారు