Flipkart Big Dussehra Sale : ఈ నెల 5 నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్.. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. 5G ఫోన్లపై మరెన్నో డీల్స్.. డోంట్ మిస్!
Flipkart Big Dussehra Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Dussehra Sale) ముగిసింది. ఇప్పుడు కొత్త బిగ్ దసరా సేల్ (Flipkart Big Dussehra Sale) ఈవెంట్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతోంది.

Flipkart Big Dussehra Sale starts on October 5, likely to offer discount on iPhone 13 and other 5G phones
Flipkart Big Dussehra Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Dussehra Sale) ముగిసింది. ఇప్పుడు కొత్త బిగ్ దసరా సేల్ (Flipkart Big Dussehra Sale) ఈవెంట్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అక్టోబరు 5న ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. నాలుగు రోజుల సేల్ ఈవెంట్ అని సేల్ పేజీ చెబుతోంది. అక్టోబర్ 8 వరకు కొనసాగుతుంది.
Flipkart Plus ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారు ఒక రోజు ముందుగానే డీల్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ప్రాథమికంగా.. అక్టోబర్ 4న ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ డీల్స్ ఎంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రాబోయే సేల్ కోసం టీజర్ పేజీని సూచించింది.

Flipkart Big Dussehra Sale starts on October 5, likely to offer discount on iPhone 13
మళ్లీ వివిధ రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తుందని వెల్లడించింది. ప్రింటర్లు, మానిటర్లు, DSLR కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లు, మరిన్ని వంటి అనేక ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ చేస్తోంది. ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ ఫోన్‌లపై కస్టమర్‌లు మళ్లీ భారీ డిస్కౌంట్ డీల్స్ పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సాధారణంగా ప్లాట్‌ఫారమ్‌లో విభిన్న విక్రయ ఈవెంట్‌లను నిర్వహిస్తుంది. ఎక్కువ సమయం ఇలాంటి డీల్‌లను అందిస్తుంది. పాత ఐఫోన్ 13 డీల్‌ను అందిస్తుందో లేదో తెలియదు. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లకు మరో అవకాశం ఇచ్చినప్పటికీ.. గతంలో డీల్స్ కొన్ని గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి.

Flipkart Big Dussehra Sale starts on October 5, likely to offer discount on iPhone 13
ఐఫోన్ 13 దాదాపు రూ. 47,000కి అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ధర క్రమంగా రూ.69,900కి పెరిగింది. ఈ కొత్త సేల్‌కు సంబంధించి కచ్చితమైన ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్‌కి సంబంధించిన సేల్ పేజీలో “Top Deals” అని సూచిస్తోంది. ఈ బ్యానర్ కింద iPhone SE, ఇతర Android ఫోన్‌లను సూచిస్తోంది.
ఐఫోన్ 13, ఐఫోన్ 12 వంటి డివైజ్‌లపై కూడా కొంత డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్‌ల ట్యాగ్‌ను ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పేర్లతో పాటు సేల్ ఈవెంట్‌లో అందుబాటులో ఉన్నాయి. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లపై ఇప్పటికీ తక్కువ ధరలకు iPhoneలను పొందవచ్చు.
టీవీలు, అప్లియన్సెస్‌లపై ఫ్లిప్‌కార్ట్ 75 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఇస్తుందని లిస్టింగ్ పేర్కొంది. 4K Ultra HD టీవీల ధరలు రూ.17,249 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ పేజీ ప్రకారం.. స్మార్ట్ టీవీలు రూ.7,199 ప్రారంభ ధరతో లభిస్తాయి. ఈ సేల్ సమయంలో, HDFC బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. చాలా డివైజ్‌ల్లో ఈ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..