Google Play UPI : ఇండియాలో గూగుల్ ప్లేలో యూపీఐ ఆటోపే పేమెంట్ ఆప్షన్ వచ్చేసిందోచ్..!

Google Play UPI : అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) కంపెనీ భారత మార్కెట్లో Google Playలో సబ్‌స్క్రిప్షన్ ఆధారిత పేమెంట్ల కోసం UPI సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. పేమెంట్ల UPI ఆటోపేను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.

Google Play UPI : ఇండియాలో గూగుల్ ప్లేలో యూపీఐ ఆటోపే పేమెంట్ ఆప్షన్ వచ్చేసిందోచ్..!

Google Play launches UPI Autopay payment option in India All details

Google Play UPI : అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) కంపెనీ భారత మార్కెట్లో Google Playలో సబ్‌స్క్రిప్షన్ ఆధారిత పేమెంట్ల కోసం UPI సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. పేమెంట్ల UPI ఆటోపేను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. NPCI UPI 2.0 కింద ఆటోపేను ప్రవేశపెట్టింది.

ఈ ఫీచర్‌కు సపోర్టు అందించే ఏదైనా UPI యాప్‌ని ఉపయోగించి పేమెంట్స్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. UPI ఆటోపే ఫీచర్ సబ్‌స్క్రిప్షన్‌లను సెటప్ చేసేందుకు సాయపడుతుంది. యూజర్లు తమ కొనుగోలు కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కార్ట్‌లోని పేమెంట్ మెథడ్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. యూజర్లు ‘Pay with UPI’ని ఎంచుకోవాలి. సపోర్టు అందించే UPI అప్లికేషన్‌లో కొనుగోలును ఆమోదించాలి.

భారత్, వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో గూగుల్ ప్లే రిటైల్, పేమెంట్స్ యాక్టివేషన్ హెడ్ సౌరభ్ అగర్వాల్ మాట్లాడుతూ.. యాప్‌లోని కంటెంట్ నిర్ధారించడానికి పాపులర్ సమర్థవంతమైన పేమెంట్ మెథడ్స్ యాడ్ చేసుకోవచ్చునని చెప్పారు. ప్లాట్‌ఫారమ్‌లో UPI ఆటోపే కాంటాక్టుతో కంపెనీ UPI సౌలభ్యాన్ని సబ్‌స్క్రిప్షన్ ఆధారిత కొనుగోళ్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Google Play launches UPI Autopay payment option in India All details

Google Play launches UPI Autopay payment option in India

అదే సమయంలో స్థానిక డెవలపర్‌లు Google Playలో సబ్‌స్క్రిప్షన్ ఆధారిత పేమెంట్లు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) జూలై 2020లో UPI ఆటోపేను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ కస్టమర్‌లు EMI పేమెంట్స్, మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లులు మొదలైన రికరింగ్ పేమెంట్ల కోసం ఏదైనా UPI యాప్‌లను ఉపయోగించి ఈ-మాండేట్ ఎనేబుల్ చేస్తుంది. Google Health Connect యాప్ ఇప్పుడు ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

ఈ యాప్ యూజర్లు తమ ఫిట్‌నెస్ డేటాను ఒకే చోట మల్టీ యాప్‌ల నుంచి మేనేజ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. Health Connect అని పిలిచే ఈ యాప్ మొదటిసారిగా Google I/Oలో మే 2022లో ప్రవేశపెట్టబడింది. ఈ యాప్ అధికారికంగా ఈరోజు బీటాలో లాంచ్ అవుతుంది. ఇప్పుడు Google Play Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Google Health Connect యూజర్లకు తమ ప్రైవసీ సెట్టింగ్‌లను గ్రాన్యులర్ కంట్రోల్‌లతో నిర్వహించేందుకు వీలు కల్పిస్తుంది. ఏ యాప్‌లు ఏ సమయంలోనైనా డేటాకు యాక్సెస్‌ చేసుకునేలా వీలు కల్పిస్తుందని Google తెలిపింది. యూజర్‌లకు కేంద్రీకృత ప్రైవసీ కంట్రోల్ అందిస్తూనే మీ యాప్‌ల మధ్య కనెక్టివిటీని సులభతరం చేసే’ హెల్త్ కనెక్ట్ యాప్‌ను రూపొందించేందుకు టెక్ దిగ్గజం Samsungతో భాగస్వామ్యం కలిగి ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus Pad India : భారత్‌లో రూ.20వేల లోపు ధరకే వన్‌ప్లస్ నుంచి ట్యాబ్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?