Whatsapp Multiple Devices : మల్టీపుల్ డివైజ్‌ల్లో వాట్సాప్ అకౌంట్ Unlink చేయండిలా..!

Whatsapp Multiple Devices : వాట్సాప్ (Whatsapp) ఇటీవలే multi-device feature ఫీచర్ తీసుకొచ్చింది. గతంలో ఈ కొత్త ఫీచర్ కేవలం వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.

Whatsapp Multiple Devices : మల్టీపుల్ డివైజ్‌ల్లో వాట్సాప్ అకౌంట్ Unlink చేయండిలా..!

How To Remove Your Whatsapp Account From Multiple Devices, Follow These Steps

Whatsapp Multiple Devices : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఇటీవలే multi-device feature ఫీచర్ తీసుకొచ్చింది. గతంలో ఈ కొత్త ఫీచర్ కేవలం వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు రెగ్యులర్ వాట్సాప్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ యూజర్లకు చాలా ఉపయోగకరమని చెప్పవచ్చు. ప్రైమరీ డివైజ్ కనెక్ట్ చేయకుండానే మల్టీ డివైజ్‌ల్లో WhatsApp అకౌంట్ లాగిన్ అయ్యేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయినప్పటికీ మీరు ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో మెసేజింగ్ యాప్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. మీ ప్రైమరీ మొబైల్ అకౌంట్ స్విచ్ఛాఫ్ అయినా సరే ఇతర డివైజ్ లకు మీ వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ అయ్యే ఉంటుంది.

అందుకు మీరు చేయాల్సిందిల్లా.. ఏయే డివైజ్ ల్లో మీ వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ కావాలో వాటిలో ప్రైమరీ మొబైల్ ద్వారా కనెక్ట్ కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా డివైజ్‌లకు మీ వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే.. Link అవుతుంది. వాట్సాప్ గరిష్టంగా ఒకేసారి 4 డివైజ్‌ల్లో సింగిల్ వాట్సాప్ అకౌంట్ లింక్ అయ్యేందుకు లిమిట్ విధించింది. అంతకంటే ఎక్కువ డివైజ్‌లను లింక్ చేయడం కుదరదు. ఈ మల్టీ డివైజ్ ఫీచర్ చాలా కాలంగా టెస్టింగ్ దశలోనే ఉంది. కొంతమంది యూజర్లలో ఇప్పటికీ స్టేబుల్ వెర్షన్‌తో డేటా సింక్-అప్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

How To Remove Your Whatsapp Account From Multiple Devices, Follow These Steps (1)

How To Remove Your Whatsapp Account From Multiple Devices, Follow These Steps

వాట్సాప్ కొన్ని నెలల క్రితమే ఈ సమస్యను ఫిక్స్ చేసింది. డేటా సింకరైజ్ సమస్య ఉన్నప్పుడు అది వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ డివైజ్ నుంచి మీ అకౌంటును ఆటోమాటిక్‌గా డిలీట్ చేసేస్తుంది. మీరు WhatsApp అకౌంట్ మల్టీ డివైజ్‌ల్లో లింక్ చేయడం ద్వారా కొన్నిసార్లు ఇబ్బంది తలెత్తవచ్చు. డేటా సింక్-అప్ సమస్యలు రాకుండా ఉండాలంటే.. కొన్ని డివైజ్‌ల్లోనే WhatsApp అకౌంట్ ఉపయోగించాల్సి ఉంటుంది. మీ WhatsApp అకౌంట్ మల్టీ డివైజ్‌లకు కనెక్ట్ కాకుడదంటే.. ఎలా Unlink చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. మల్టీ డివైజ్‌ల్లో నుంచి మీ WhatsApp అకౌంట్ Unlink చేసే ప్రక్రియ చాలా ఈజీగా ఉంటుంది. మీరు మొదట ఎలా లింక్ చేస్తారో అలానే Unlink చేయాల్సి ఉంటుంది.

మల్టీ డివైజ్‌ల్లో మీ WhatsApp అకౌంట్ అన్‌లింక్ చేయాలంటే.. ?

1. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. స్క్రీన్ రైట్ టాప్ కార్నర్‌లో త్రిడాట్స్ ఐకాన్‌పై నొక్కాలి.
2. లింక్ అయిన డివైజ్‌లపై మళ్లీ నొక్కాలి. మీకు కొత్త సెక్షన్ కనిపిస్తుంది.
3. మీ WhatsApp అకౌంట్ యాక్సెస్‌ స్క్రీన్ కిందిభాగంలో డివైజ్ లిస్టు కనిపిస్తుంది.
4. ఏ డివైజ్‌లో లింక్ అయ్యారో దానిపై గట్టిగా నొక్కిపట్టాలి. అప్పుడు మీకు లాగ్ అవుట్ బటన్‌ కనిపిస్తుంది.
5. మీ WhatsApp అకౌంట్ ఆ డివైజ్ నుంచి Unlink అవుతుంది.
6. ఒకసారి Unlink చేశాక.. మళ్లీ అదే డివైజ్‌లో Link చేయాలంటే ప్రైమరీ డివైజ్ నుంచి QR కోడ్‌ స్కాన్ చేయాల్సి ఉంటుంది.

Read Also : WhatsApp Support : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. సపోర్ట్‌తో పేరుతో కొత్త తరహా మోసం