Infinix Mobile: కర్వ్‌డ్ డిస్‌ప్లేతో రెడీ అవుతున్న ఇన్ఫినిక్స్ ఫోన్

బడ్జెట్ రేంజ్‌లో ఉండటమే కాదు ఎక్స్‌టార్డినరీ క్వాలిటీ అందించే ఇన్ఫినిక్స్ మొబైల్ మరికొద్ది రోజుల్లో అద్భుతమైన ఫీచర్లతో లేటెస్ట్ మోడల్ ను మార్కెట్లోకి దింపనుంది. కర్వ్‌డ్ డిస్‌ప్లేతో పాటు పెరిస్కోప్ కెమెరా, 160W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో విడుదల చేయనున్నారట.

Infinix Mobile: కర్వ్‌డ్ డిస్‌ప్లేతో రెడీ అవుతున్న ఇన్ఫినిక్స్ ఫోన్

Inifinix

Infinix Mobile: బడ్జెట్ రేంజ్‌లో ఉండటమే కాదు ఎక్స్‌టార్డినరీ క్వాలిటీ అందించే ఇన్ఫినిక్స్ మొబైల్ మరికొద్ది రోజుల్లో అద్భుతమైన ఫీచర్లతో లేటెస్ట్ మోడల్ ను మార్కెట్లోకి దింపనుంది. కర్వ్‌డ్ డిస్‌ప్లేతో పాటు పెరిస్కోప్ కెమెరా, 160W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో విడుదల చేయనున్నారట.

మిగిలిన స్మార్ట్ ఫోన్లకు కాంపిటీషీన్ గా మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్ ధర ఇవే ఫీచర్లు ఇస్తున్న మొబైల్స్ కంటే తక్కువ ధరలోనే ఉంటుందట. పెద్ద కెమెరా సెన్సార్ తో దీర్ఘ చతురస్రాకారంలో దిగనున్న ఈ మోడల్.. ఫీచర్లు అమోఘంగా ఉండనున్నాయి.

ముందువైపు సెల్ఫీ కెమెరాతో పాటు ఫింగర్ ప్రింట్ యాక్సిసెస్ డిస్ ప్లే మీదనే ఉండనుంది. చివర్లో యూఎస్బీ టైప్ సీ పోర్టుతో రానుండగా.. స్పీకర్లు కుడివైపున ఉంటాయి. కుడివైపు అంచులో పవర్, వాల్యూమ్ బటన్ ఇవ్వనున్నారు. 160వాట్ల అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్.. ఫెసిలిటీని ఆఫర్ చేస్తుంది కంపెనీ.

గతంలో లాంచ్ చేసిన రెండు స్మార్ట్ ఫోన్లు నోట్ 10, నోట్ 10 ప్రోలు రూ. 10,999 (4జీబీ ర్యామ్+64 హార్డ్ డిస్క్) రూ.11,999 (6జీబీ ర్యామ్+128 హార్డ్ డిస్క్)ధరలతో రిలీజ్ అయింది.