Moto X40 Series : మోటోరోలా నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ X40 5G సిరీస్ ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto X40 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా (Motorola) నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్ వస్తోంది. ఇటీవలే లేటెస్ట్ టాప్-నాచ్ స్నాప్‌డ్రాగన్ Qualcomm 8 Gen 2 చిప్‌సెట్‌ను మోటో ప్రకటించింది.

Moto X40 Series : మోటోరోలా నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ X40 5G సిరీస్ ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto X40 series could launch this month, here is what we know about this flagship 5G phone

Moto X40 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా (Motorola) నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్ వస్తోంది. ఇటీవలే లేటెస్ట్ టాప్-నాచ్ స్నాప్‌డ్రాగన్ Qualcomm 8 Gen 2 చిప్‌సెట్‌ను మోటో ప్రకటించింది. ఇప్పుడు ఈ చిప్‌తో రాబోయే నెలల్లో అనేక బ్రాండ్‌లు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ AnTuTu స్కోర్‌ను షేర్ చేసిన సందర్భంగా Moto X40 సిరీస్ కూడా అదే చిప్‌తో వచ్చే అవకాశం ఉందని మొబైల్ బిజినెస్ ఆర్మ్ Lenovo జనరల్ మేనేజర్ ధృవీకరించారు.

Moto X40 సిరీస్ ఫోన్ డిసెంబర్‌లో ఎప్పుడైనా రావొచ్చు. మోటరోలా దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. రాబోయే Moto 5G ఫోన్లకు సంబంధించి ఫీచర్లు ఇప్పటికే చాలా లీక్ అయ్యాయి. రాబోయే ఫోన్ మోటో ఎడ్జ్ 40 సిరీస్‌గా గ్లోబల్ మార్కెట్‌లలో ఆవిష్కరించే అవకాశం ఉంది.

మోటరోలా చైనాలో ఈ నెలలో (Moto X40, Moto X40 Pro) రెండు ఫోన్‌లను ప్రకటించనుంది. రెండూ ఒకే స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో రానున్నాయి. ప్రో మోడల్ 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ టెక్, AMOLED డిస్‌ప్లేకు సపోర్టుతో వస్తుందని చెప్పవచ్చు.

Moto X40 series could launch this month, here is what we know about this flagship 5G phone

Moto X40 series could launch this month, what we know about this flagship 5G phone

Read Also : WhatsApp Tips : వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను ఎలా రీస్టోర్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

లీక్‌ల ప్రకారం.. పంచ్-హోల్ డిజైన్‌తో కూడిన కర్వ్డ్ స్క్రీన్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు. స్టాండర్డ్ మోడల్.. మరోవైపు, OLED ప్యానెల్‌తో వస్తుందని చెప్పవచ్చు.1080p రిజల్యూషన్‌తో రానుంది. 144Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.

వెనుక కెమెరా సెటప్‌లో మోటో ఎడ్జ్ ప్లస్ మాదిరిగానే రెండు 50-MP మెయిన్, అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్‌లు ఉండవచ్చు. మెరుగైన ఇమేజింగ్ రిజల్ట్స్ కోసం.. కంపెనీ 2-MP సెన్సార్‌ను 12-MP కెమెరాతో వచ్చింది. Moto X40 కూడా 18GB వరకు RAMతో లాంచ్ అవుతుందని చెప్పవచ్చు. ఈ డివైజ్ గరిష్టంగా 512GB స్టోరేజ్ మోడల్‌తో అందుబాటులో ఉంచవచ్చు. రెండు మోడల్‌లు IP68-రేటింగ్‌ను కలిగి ఉంటాయి. రాబోయే మోటోరోలా 5G ఫోన్‌లు సరికొత్త ఆండ్రాయిడ్ 13 OSతో రన్ అవుతాయని భావించవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Tips : వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను ఎలా రీస్టోర్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!