Nikon India: రాజమండ్రిలో నూతన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ప్రారంభించిన నికాన్‌ ఇండియా

ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో నికాన్‌ నూతన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. వైవిధ్యమైన సంస్కృతి, వారసత్వంకు సుప్రసిద్ధి రాజమండ్రి. భారతదేశ వ్యాప్తంగా మా కార్యకలాపాలు విస్తరిస్తోన్న వేళ, భారతీయ ఫోటోగ్రఫీ కమ్యూనిటీకి మద్దతు అందించాలనే మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నాము

Nikon India: రాజమండ్రిలో నూతన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ప్రారంభించిన నికాన్‌ ఇండియా

Nikon India: ఇమేజింగ్‌ టెక్నాలజీలో అగ్రగామి నికాన్‌ కార్పోరేషన్‌కు 100 శాతం అనుబంధ సంస్థ అయిన నికాన్‌ ఇండియా, తమ నూతన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద ప్రారంభించింది. ఇది జైన్‌ డిజిటల్‌ షాపీ, స్టేడియం రోడ్‌, ఇన్నీస్‌పేట వద్ద ఉంది. ఈ ఎక్స్‌పీరియెన్స్‌ జోన్‌ను నేడు నికాన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జన్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ ప్రాంతంలోని ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ ప్రతిభకు నికాన్‌ యొక్క ప్రపంచ శ్రేణి ఉత్పత్తులతో కూడిన నిధిని ఈ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ అందుబాటులోకి తీసుకురానుంది.

AP Polycet 2023 : పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల తేదీ ఖరారు, ఇక్కడ చూసుకోండి..

రాజమండ్రిలోని నికాన్‌ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ అత్యంత సౌకర్యవంతంగా, లీనమయ్యే అనుభవాలను అందించే రీతిలో తీర్చిదిద్దబడింది. ఇక్కడ విస్తృతశ్రేణిలో ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. వీటిలో నికాన్‌ యొక్క విప్లవాత్మక మిర్రర్‌ లెస్‌ సిరీస్‌, డీ–ఎస్‌ఎల్‌ఆర్‌ శ్రేణి కెమెరాలతో పాటుగా హై జూమ్‌ కూల్‌పిక్స్‌ కెమెరాలు, లెన్స్‌లు, యాక్ససరీలు, నికాన్‌ సపోర్ట్‌ ఆప్టిక్స్‌ శ్రేణి వంటివి ఉంటాయి. నికాన్‌ ఇండియా గతంలో పలు ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ కేంద్రాలను భారతదేశ వ్యాప్తంగా ప్రారంభించడం ద్వారా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కమ్యూనిటీ అవసరాలను తీరుస్తుంది. ఈ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ద్వారా వినియోగదారులకు లీనమయ్యే, అనుసంధానిత అనుభవాలను నికాన్‌ ఉత్పత్తులతో అందిస్తుంది. తద్వారా వారు తమ సృజనాత్మకతను వెలుపలికి తీయడంతో పాటుగా ఆవిష్కరణ, ఊహలతో ఫోటోగ్రఫీ పట్ల తమ అభిరుచిని కొనసాగిస్తున్నారు.

Hebba Patel: హైదరాబాద్‌లోని మెట్రో బ్రాండ్ వాక్‌వే స్టోర్‌‭లో న్యూ కలెక్షన్ విడుదల చేసిన నటి హెబ్బా పటేల్

ప్రారంభోత్సవ సందర్భంగా సజ్జన్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘ ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో నికాన్‌ నూతన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. వైవిధ్యమైన సంస్కృతి, వారసత్వంకు సుప్రసిద్ధి రాజమండ్రి. భారతదేశ వ్యాప్తంగా మా కార్యకలాపాలు విస్తరిస్తోన్న వేళ, భారతీయ ఫోటోగ్రఫీ కమ్యూనిటీకి మద్దతు అందించాలనే మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నాము. ఈ ప్రాంతంలోని ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు వినోదాత్మక, అనుసంధానిత అనుభవాలను అందించనుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.