AP Polycet 2023 : పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల తేదీ ఖరారు, ఇక్కడ చూసుకోండి..

AP Polycet 2023 Results : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్ - 2023) నిర్వహించారు. 1,43,625 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు.. ఫలితాలను, ర్యాంకుల వివరాలను https://polycetap.nic.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

AP Polycet 2023 : పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల తేదీ ఖరారు, ఇక్కడ చూసుకోండి..

AP Polycet 2023 Results(Photo : Google)

AP Polycet 2023 Results : ఏపీలో పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 20న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. పాలిటెక్నిక్ ప్రవేశానికి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ వివరాలను సైతం అదే రోజు ప్రకటిస్తామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్ – 2023) నిర్వహించారు. ఫలితాలను 20వ తేదీన విడుదల చేయనున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు.

Also Read..Heat Wave : మరో 2 వారాలు మంటలే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పిన ఐఎండీ

రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్ – 2023 పరీక్ష నిర్వహించారు. 1,43,625 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు.. ఫలితాలను, ర్యాంకుల వివరాలను https://polycetap.nic.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు సంబంధించి.. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరచిన వారికి మాత్రమే సీట్లు లభిస్తాయి.

పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.