PAN-Aadhaar Link : మీ ఆధార్- పాన్ కార్డు ఇంకా లింక్ చేయలేదా? ఈ తేదీలోగా SMS ద్వారా వెంటనే లింక్ చేయండి.. ఇదిగో ప్రాసెస్..!
PAN-Aadhaar Link : మీ ఆధార్, పాన్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే ఇప్పుడే లింక్ చేసుకోండి.. మీ పాన్ కార్డు, ఆధార్ కార్డ్‌లను లింక్ చేసేందుకు మార్చి 31, 2023 చివరి తేదీ అనే విషయం మర్చిపోకండి.

Still not linked PAN and Aadhaar_ here is how to link through SMS by March 31 2023
PAN-Aadhaar Link : మీ ఆధార్, పాన్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే ఇప్పుడే లింక్ చేసుకోండి.. మీ పాన్ కార్డు, ఆధార్ కార్డ్‌లను లింక్ చేసేందుకు మార్చి 31, 2023 చివరి తేదీ అనే విషయం మర్చిపోకండి. ఈ గడువులోగా ఎవరైనా తమ పాన్, ఆధార్ కార్డ్‌లను లింక్ చేయకపోతే పాన్ పనిచేయదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆదాయపు పన్ను శాఖ పాన్ హోల్డర్‌లు మార్చి 2023 చివరి నాటికి ఆధార్‌తో కార్డును లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అందుకే ఆలస్యం చేయవద్దు. ఈరోజే లింక్ చేయండి. IT చట్టం ప్రకారం.. మినహాయింపు వర్గంలోకి రాని పాన్-హోల్డర్లందరికీ తమ ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ఆధార్‌తో పర్మినెంట్ అకౌంట్ నంబర్‌లు (PAN) ఏప్రిల్ 1, 2023 నుంచి అన్‌లింక్ చేసిన PAN పనిచేయదని తెలిపింది. మార్చి 31, 2023 గడువులోగా పాన్, ఆధార్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు, పాన్, ఆధార్ లింక్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. SMS ద్వారా పాన్, ఆధార్ కార్డ్‌లను ఎలా లింక్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
SMS ద్వారా ఆధార్, పాన్ కార్డ్‌లను ఎలా లింక్ చేయాలంటే? :
* టెక్స్ట్ మెసేజ్ యాప్‌కి వెళ్లండి.
* ఇప్పుడు UIDPAN ఫార్మాట్‌లో SMS టైప్ చేయండి.
* మీరు టైప్ చేయాల్సిందల్లా.. UIDPAN (స్పేస్) 12-అంకెల ఆధార్ నంబర్ (స్పేస్) 10-అంకెల పాన్ నంబర్..
* మీరు మీ రిజిస్టర్డ్ నంబర్ నుంచి 567678 లేదా 56161కి SMS పంపాలి.
* మెసేజ్ పంపిన తర్వాత మీకు ఆధార్, పాన్ కార్డ్ లింక్ గురించి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

Still not linked PAN and Aadhaar
ఆన్‌లైన్‌లో పాన్ – ఆధార్ కార్డ్‌లను ఎలా లింక్ చేయాలంటే? :
భారత ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా కూడా పాన్ – ఆధార్ కార్డ్‌లను లింక్ చేసుకోవచ్చు.
* మీరు కేవలం eportal.incometax.gov.in లేదా incometaxindiaefiling.gov.inని క్లిక్ చేయవచ్చు.
* వెబ్‌సైట్‌లో మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. మీ పాన్ లేదా ఆధార్ నంబర్ యూజర్ ఐడీగా సెట్ చేసుకోవచ్చు.
* పోర్టల్‌లోకి లాగిన్ చేసేందుకు మీ యూజర్ ID, పాస్‌వర్డ్, DOB (డేట్ ఆఫ్ బర్త్)ని ఉపయోగించండి.
* పాప్-అప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది లేదా మీరు హోమ్‌పేజీలో చూపిన ‘Quick Links’పై క్లిక్ చేయవచ్చు.
* హోమ్‌పేజీలో చూపిన లింక్ ఆధార్ ఎంపికపై Click చేయండి.
* మీరు ఇప్పుడు మీ పాన్, ఆధార్ నంబర్‌ని టైప్ చేయవచ్చు.
* మీ ఆధార్ కార్డ్‌లో పేర్కొన్న విధంగా మీ పేరును యాడ్ చేయొచ్చు.
* ఇప్పుడు వర్తిస్తే ‘I have only year of birth in Aadhaar card’ అనే బాక్సును ఎంచుకోండి.
* ధృవీకరించడానికి Captcha టైప్ చేయండి
* ఆధార్, పాన్ కార్డ్ లింక్ అయిన తర్వాత మీకు నిర్ధారణ నోటిఫికేషన్ వస్తుంది.
ఇప్పుడు, మీ పాన్, ఆధార్ కార్డ్ వివరాలు సరిపోలకపోతే.. మీకు Reject మెసేజ్ వస్తుంది. రెండు డాక్యుమెంట్‌లను సరైన సమాచారంతో లింక్ చేసేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.