ఆకాశంలో అద్భుతం.. చంద్రుడు, అంగారకుడు, యురేనస్ కలిసిన వేళ..

ఆకాశంలో అద్భుతం.. చంద్రుడు, అంగారకుడు, యురేనస్ కలిసిన వేళ..

Moon Mars And Uranus Meet In The Sky  : ఆకాశంలో అద్భుతం జరిగింది. చంద్రుడు, అంగారకుడు యురేనస్ ఒకే చోట కలిసిన అరుదైన దృశ్యం కనిపించింది. జనవరి 21న రాత్రి సమయంలో ఈ అరుదైన అద్భుతం కనువిందు చేసింది. సాయంత్రం సమయంలో చంద్రుడు, అంగారకుడి మధ్య యురేనస్ చేరుకున్నాడు. అంగారకుడు 1.75 డిగ్రీల కోణంలో యురేనస్‌కు ఉత్తర భాగానికి చేరుకున్నాడు. అదే ప్రాంతానికి చంద్రుడు కూడా చేరుకున్నాడు.


ఇలా జరగడం అంతరిక్షంలో అరుదైన క్షణంగా ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఖగోళ దృశ్యం రాత్రి అందరికి సులభంగా కనిపిస్తుందని అంటున్నారు. ఆకాశంలో ముందుగా అంగారకుడు ప్రత్యక్షమైన కొన్ని గంటల్లో మరో కాంతివంతమైన నక్షత్రంగా కనిపిస్తుంది. అదే.. యురేనస్ గ్రహం.. ఒకవేళ మీరు యూకేలో ఉంటే.. సాయంత్రం 4.43 లకు ఈ దృశ్యం కనిపిస్తుంది.


కానీ, మూడు గ్రహాలు మాత్రం 6.06 గంటలకు మాత్రమే ఒకేదగ్గరకు చేరుకుంటాయి. అప్పటినుంచి అర్ధరాత్రి 12.36 గంటల వరకు మూడు గ్రహాలు కనువిందు చేస్తాయి. అంగారకుడు కాస్తా ప్రకాశంవంతంగా కనిపించినప్పటికీ.. యురేనస్ మందంగా కనిపిస్తుంది. నిలువుగా కనిపించే ఈ దృశ్యంలో చంద్రుడు, అంగారకుడు మధ్య యురేనస్ వచ్చాడు.


SKy