Ultrahuman Ring : చేతి వేలికి రింగులా పెట్టుకోవచ్చు.. మీ ఆరోగ్యాన్ని రియల్‌టైం ట్రాక్ చేస్తుంది!

ప్రస్తుత జీవనశైలిలో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చూడటానికి ఆరోగ్యానికి ఉన్నట్టు కనిపించినా లోలోపల అనే అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.

Ultrahuman Ring : చేతి వేలికి రింగులా పెట్టుకోవచ్చు.. మీ ఆరోగ్యాన్ని రియల్‌టైం ట్రాక్ చేస్తుంది!

Ultrahuman Ring Looks Like A Usual Ring But Tracks Your Metabolic Health In Real Time (1)

Ultrahuman Ring : ప్రస్తుత జీవనశైలిలో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చూడటానికి ఆరోగ్యానికి ఉన్నట్టు కనిపించినా లోలోపల అనే అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. సరైన వ్యాయామం, కంటినిండా నిద్ర లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెటాబాలిక్ హెల్త్ రియల్ టైం చెక్ చేసుకునేందుకు అనేక స్మార్ట్ డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అందులో మరో కొత్త స్మార్ట్ ఫిట్‌నెస్ డివైజ్ ఒకటి వచ్చింది. అదే.. స్మార్ట్ ఫిట్‌నెస్ బ్రాండ్ అల్ట్రాహుమాన్ అల్ట్రాహ్యూమన్ రింగ్ (Ultrahuman Ring).. ఈ రింగ్ ను చేతి వేలికి ధరించవచ్చు. ఇది అచ్చం Oura Ring లాగా పని చేస్తుంది. నిద్రతో పాటు, రోజువారీ కార్యకలాపాలను కూడా ట్రాక్ చేస్తుంది. అంతేకాదు.. ఈ అల్ట్రాహ్యూమన్ రింగ్ మెటబాలిక్-ట్రాకింగ్ చేయగలదు. కదలికలు, నిద్ర, శరీరం, పవర్ డైనమిక్‌లను రియల్ టైం ట్రాక్ చేస్తుంది.

యూజర్లు తమ ఫిట్ నెస్ కోసం ఆరోగ్యాన్ని కంట్రోల్ చేయడానికి ఈ రింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. Ultrahuman రింగ్ కనిష్ట ఫారమ్ ఫ్యాక్టర్‌ను అందిస్తుంది. ఈ స్క్రీన్‌లు లేదా వైబ్రేషన్‌లను అందించదు. యూజర్లను నోటిఫికేషన్‌ల సమస్యకు దూరంగా ఉంచుతుంది. యూజర్లు తమకు అవసరమైప్పుడు యాప్‌లో తమ ప్రాణాధారాలను చెక్ చేసుకోవచ్చు. అల్ట్రాహ్యూమన్ రింగ్‌ను వర్కౌట్ల సమయంలో కూడా ట్రాకింగ్ చేసేలా రూపొందించారు. రింగ్ టంగ్‌స్టన్ కార్బైడ్‌తో కూడిన టైటానియం బాడీతో రూపొందించారు. టూల్ స్టీల్ కన్నా 5 రెట్లు గట్టిదని కంపెనీ పేర్కొంది. స్క్రాచ్ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది.

Ultrahuman Ring Looks Like A Usual Ring But Tracks Your Metabolic Health In Real Time

Ultrahuman Ring Looks Like A Usual Ring But Tracks Your Metabolic Health In Real Time

నిద్ర, విశ్రాంతి సమయంలో లోపలి షెల్ సౌకర్యవంతంగా ఉండేలా రింగ్‌ని డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ డివైజ్.. 5 రోజుల బ్యాటరీ లైఫ్‌తో పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. Ultrahuman రింగ్ జూలై 7 2022 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 2022 నుంచి షిప్పింగ్ ప్రారంభం కానుంది. అల్ట్రాహ్యూమన్ రింగ్, మెటబాలిక్ బయోమార్కర్ల కొత్త సూట్‌తో వచ్చింది. మీ గ్లూకోజ్ మెటాబాలిక్ ఎలా పని చేయాలో ఈ రింగు ధరించడం ద్వారా తెలుసుకోవచ్చు. మీ గ్లూకోజ్ మెటబాలిజంలో నిద్రలేమి సమస్యలతో పాటు ఆహారం అలవాట్లతో మీ ఆరోగ్యంపై ఎంత ప్రభావితం చేస్తాయో గుర్తించవచ్చునని అల్ట్రాహ్యూమన్ వ్యవస్థాపకుడు, CEO మోహిత్ కుమార్ పేర్కొన్నారు.

Read Also  : Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్‌డే సేల్ డేట్ ఫిక్స్.. కొత్త స్మార్ట్ ఫోన్లపై అదిరే డీల్స్.. ఏయే ఆఫర్లు, డిస్కౌంట్లు ఉండొచ్చుంటే?