ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ : Vivaldi కొత్త బ్రౌజర్ ఇదే

గూగుల్ క్రోమ్.. ప్రతి సిస్టమ్‌లో కనిపించే కామన్ బ్రౌజర్. మొబైల్ సహా డెస్క్ టాప్ అన్ని డివైజ్‌ల్లో క్రోమ్ బ్రౌజర్ వాడే యూజర్లు ఎక్కువగా ఉంటారు.

  • Published By: sreehari ,Published On : September 10, 2019 / 11:46 AM IST
ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ : Vivaldi కొత్త బ్రౌజర్ ఇదే

గూగుల్ క్రోమ్.. ప్రతి సిస్టమ్‌లో కనిపించే కామన్ బ్రౌజర్. మొబైల్ సహా డెస్క్ టాప్ అన్ని డివైజ్‌ల్లో క్రోమ్ బ్రౌజర్ వాడే యూజర్లు ఎక్కువగా ఉంటారు.

గూగుల్ క్రోమ్.. ప్రతి సిస్టమ్‌లో కనిపించే కామన్ బ్రౌజర్. మొబైల్ సహా డెస్క్ టాప్ అన్ని డివైజ్‌ల్లో క్రోమ్ బ్రౌజర్ వాడే యూజర్లు ఎక్కువగా ఉంటారు. మొజిల్లా ఫైర్ పాక్స్ బ్రౌజర్, క్రోమ్ ఫ్యాన్స్ ఎక్కువ. వీటిలో సైట్ సర్ఫ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుందని చాలామంది యూజర్లు ఫీల్ అవుతుంటారు. క్రోమ్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లకు పోటీగా ఆండ్రాయిడ్ వెర్షన్ కొత్త బ్రౌజర్ వచ్చింది. అదే.. Vivaldi బ్రౌజర్. ఇదొక కస్టమైజబుల్ వెబ్ బ్రౌజర్. 

ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై మొబైల్ వెర్షన్, డెస్క్ టాప్ వెర్షన్ రెండు రిలీజ్ అయ్యాయి. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ కూడా లాంచ్ అయింది. Opera వెబ్ బ్రౌజర్ పై వర్క్ చేసిన గ్రూపు డెవలపర్లు Vivaldi వెబ్ బ్రౌజర్ రూపొందించారు. ఈ బ్రౌజర్ పూర్తిగా కస్టమైజబుల్ బ్రౌజర్. మీకు నచ్చిన విధంగా థీమ్, స్టయిల్ మార్చుకోవచ్చు. మొబైల్ యూజర్ల కోసం కొత్త ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ బ్రౌజర్‌లో పవర్ యూజర్ స్పిరిట్ తీసుకొచ్చింది. వివాల్డి (Vivaldi) ఆండ్రాయిడ్ వెర్షన్ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ వెర్షన్ లో ప్రత్యేకమైన ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. 

కొత్త tab ఓపెన్ చేయగానే మీకు speed dials ఆప్షన్ చూడొచ్చు. ఇక్కడే సైట్ షార్ట్ కట్స్, బుక్ మార్క్స్ ఉంటాయి. వీటిని అవసరమైన విధంగా ఆర్గనైజ్ లేదంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. నేరుగా నేవిగేట్ చేయకుండా ప్రత్యేకమైన సెర్చ్ ఇంజిన్ వినియోగించుకోవచ్చు. ఇందుకు మీరు Adress barలో ‘custom nicknames’ టైప్ చేయండి. ‘d’ అంటే.. DuckDuckGo అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇదో సెర్చ్ ఇంజిన్. Google సెర్చ్ ఇంజిన్ మాదిరిగా ఉంటుంది. 

ఈ బ్రౌజర్ లోని డేటా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ బై-డిఫాల్ట్ గా ఉంటుంది. Firefox బ్రౌజర్ అకౌంట్ syncతో పోలిస్తే డిఫాల్ట్ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంది. ఇందులో గూగుల్ మాత్రమే ఎండ్-టూ-ఎండ్ ఫ్లేవర్ ఆఫర్ చేస్తోంది. ఒకవేళ మీరు passphrase ఆప్షన్ సెట్ చేసి ఉంటే మాత్రం గూగుల్.. మీ syncing back చూడలేదు.  

Vivaldi బ్రౌజర్ లో స్పెషల్ ఫీచర్లు ఇవే :
* టాప్ లెఫ్ట్ కార్నర్ లో (V) క్లిక్ చేస్తే Menu Bar కనిపిస్తుంది.
* టాప్ రైట్ కార్నర్ లో హిస్టరీ బటన్.. క్లిక్ చేస్తే Clear all కనిపిస్తుంది. డేటా డిలీట్ చేసుకోవచ్చు.
* బ్రౌజర్ థీమ్స్ స్టయిల్స్ కూడా మార్చుకోవచ్చు. 
* బ్రౌజర్ కింది లెఫ్ట్ కార్నర్ షార్ట్ కట్ టూల్స్, సెట్టింగ్స్ ఆప్షన్లు కనిపిస్తాయి. 
* రైట్ కార్నర్ కింది భాగంలో Capture page బటన్ ఉంటుంది. 
* ఏ వెబ్ పేజీ అయినా ఈజీగా నచ్చిన ఫార్మాట్లలో (jpg, png) క్యాప్చర్ చేసుకోవచ్చు. 
* Toggle Images, animation ఆప్షన్లు ఉన్నాయి. 
* Page actions (<>) ఆప్షన్ కూడా ఉంది. (టిక్ మార్క్) వెబ్ పేజీ స్టయిల్ మార్చుకోవచ్చు. 
* వెబ్ పేజీ జూమ్ ఇన్ zoom out చేసుకోవచ్చు (100%) ఫిక్సడ్ రెజుల్యుషన్. 
* టాప్ కార్నర్ అడ్రస్ బార్ కింద Reader View ఆప్షన్ ఉంది. 
* పక్కనే Bookmarks ఆప్షన్ కూడా ఉంది. 
* క్రోమ్ బ్రౌజర్ మాదిరిగానే అకౌంట్ లాగిన్ ఆప్షన్.. గెస్ట్ యూజర్ విండో కూడా ఉంది. 
* sync ఆప్షన్ కూడా ఉంది.
* స్పీడ్ డయల్ (+) 
* బుక్ మార్క్స్