WhatsApp Web కొత్త ఫీచర్లు : డెస్క్‌టాప్‌ నుంచి వీడియో, వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు!

  • Published By: sreehari ,Published On : October 23, 2020 / 04:59 PM IST
WhatsApp Web కొత్త ఫీచర్లు : డెస్క్‌టాప్‌ నుంచి వీడియో, వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు!

Updated On : October 23, 2020 / 5:12 PM IST

WhatsApp Calling Features for Desktop : ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. మొబైల్ వెర్షన్ యూజర్లతో పాటు డెస్క్ టాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది.

ఇప్పుడు వాట్సాప్ వెబ్ (Desktop) వెర్షన్ యూజర్ల కోసం వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్లను తీసుకొస్తోందని WABetainfo report వెల్లడించింది.



ప్రస్తుతానికి ఈ ఫీచర్లు డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉన్నాయని, అతి త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. డెస్క్ టాప్ ఎకోసిస్టమ్‌లో ఇది కొత్త ఫీచర్ కానే కాదు.

ఎందుకంటే.. ఇతర మెసేజింగ్ ప్లాట్ ఫాంలు వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్లను ఎప్పుడో అందుబాటులోకి తీసుకొచ్చాయి.



వాట్సాప్ వెబ్ వెర్షన్ యూజర్లకు గ్రూపు వాయిస్, వీడియో కాల్స్ కూడా కొత్త అప్ డేట్ తో అందుబాటులోకి రానున్నాయని నివేదిక తెలిపింది.
WhatsApp WebWABetainfo రిపోర్టు ప్రకారం.. వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ ద్వారా ఎలా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చో కొన్ని స్ర్కీన్ షాట్లను అందిస్తోంది.



డెస్క్ టాప్ యూజర్లు pop-up విండో ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. వాయిస్ లేదా వీడియో కాల్ చేసినప్పుడు ఫోన్ మాదిరిగానే కాలర్ కాంటాక్ట్ వివరాలు కనిపిస్తాయి. బ్రౌజర్ నుంచి కూడా మీరు ఏదైనా కాల్ లిఫ్ట్ చేయడం లేదా తిరస్కరించాలంటే Accept లేదా Decline చేయొచ్చు.



వాట్సాప్ వెబ్ బ్రౌజర్ లో టాప్ రైట్ కార్నర్ లో Search Bar దగ్గర ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. మీరు కాల్ చేయగానే మీకో ఫ్లోటింగ్ విండో డిస్ ప్లే అవుతుంది. కాల్ స్టేటస్ కనిపిస్తుంది. అక్కడ కాల్ మ్యూట్ చేయడం లేదా ఎండ్ చేయొచ్చు.



ప్రస్తుత వాట్సాప్ బీటా వెర్షన్ డెస్క్ టాప్ కాలింగ్ వెర్షన్ మాదిరిగానే ఉంటుందా? అనేదానిపై క్లారిటీ లేదు. మీ ల్యాప్ టాప్ నుంచి వాట్సాప్ వెబ్ ఫీచర్ల ఆప్షన్ మల్టీ డివైజ్ సపోర్టు చేసేలా మరోవైపు ఫేస్ బుక్ కూడా ప్రయత్నిస్తూనే ఉంది.