WhatsApp Feature: వేరే వాట్సప్ నెంబర్ ఛాటింగ్ కొత్త ఫోన్లోకి… ఎలాగో తెలుసా

వాట్సప్ ఎట్టకేలకు సాధించింది. ఎన్నాళ్లుగానో వేరే నెంబర్ చాట్ హిస్టరీని కొత్త ఫోన్లోకి వచ్చేలా ఫీచర్ తీసుకొచ్చింది. మరి కొద్ది రోజుల్లోనే ఐఓఎస్, ఆండ్రాయిడ్లలోకి...

WhatsApp Feature: వేరే వాట్సప్ నెంబర్ ఛాటింగ్ కొత్త ఫోన్లోకి… ఎలాగో తెలుసా

Whatsapp Feature

WhatsApp Feature: వాట్సప్ ఎట్టకేలకు సాధించింది. ఎన్నాళ్లుగానో వేరే నెంబర్ చాట్ హిస్టరీని కొత్త ఫోన్లోకి వచ్చేలా ఫీచర్ తీసుకొచ్చింది. మరి కొద్ది రోజుల్లోనే ఐఓఎస్, ఆండ్రాయిడ్లలోకి ఈ ఫీచర్ అందుబాటులోకి తెస్తారు. దీని ప్రకారం.. ఎవరైతే యూజర్ కొత్త ఫోన్ కొనుగోలు చేసి నెంబర్ కూడా మార్చిన తర్వాత పాత చాట్ హిస్టరీ కావాలనుకుంటారో వారికే ఉపయోగపడుతుంది.

వాట్సప్ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ ఫోన్లు ఐక్లౌడ్ నుంచి గానీ, ఐఓఎ్ నుంచి గానీ రీస్టోర్ చేసుకోలేకపోతే గూగుల్ డ్రైవ్ లో కూడా దొరకదు. దీనికే సొల్యూషన్ కోసం వాట్సప్ శ్రమిస్తోంది.

ఈ మేరకు ఫ్యూచర్ అప్ డేట్ లో మెనూలోనే న్యూ ఫోన్ ఆప్షన్ చేర్చనుంది. తద్వారా కొత్త ఫోన్ కొనగానే పాత నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అలా ఎంటర్ చేశాక పాత హిస్టరీ అంతా డౌన్ లోడ్ అవుతుంది.

ప్రస్తుతం వాట్సప్ ఫోన్ మార్చితే పాత నెంబర్ సిమ్ వేసుకుంటేనే చాట్ హిస్టరీ డౌన్ లోడ్ సాధ్యపడుతుంది. కాకపోతే అది కూడా రెండు సేమ్ మోడల్స్ మాత్రమే అయి ఉండాలి. రెండూ ఆండ్రాయడ్ ఫోన్లు అయినా కావాలి. రెండూ ఐఫోన్ మోడల్స్ అయినా కావాలి. రాబోయే కొత్త ఫీచర్ తో ఈ సమస్యలన్నింటినీ అధిగమించవచ్చు.