Telangana assembly : కేంద్రాన్ని మర్యాదగానే అడుగుతున్నాం..కానీ హైదరాబాద్‌లో స్కైవే నిర్మాణానికి సహకరించటంలేదు : కేటీఆర్

కేంద్రాన్ని మర్యాదగానే అడుగుతున్నా.. హైదరాబాద్‌లో స్కైవే నిర్మాణానికి సహకరించటంలేదని..మంత్రి కేటీఆర్ విమర్శించారు.ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మించాలనుకుంటున్నామని కానీ ఆ ప్రాంతంలో డిఫెన్స్ భూములున్నాయని ..స్కైవే నిర్మాణాలకు డిఫెన్స్ భూముల వల్ల ఇబ్బంలున్నాయి సహకరించమని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరాని సహకరించటంలేదంటూ ఆరోపించారు కేటీఆర్.

Telangana assembly : అసెబ్లీ సమావేశాల వేదికగా మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ను విశ్వనగరంలో తీర్చి దిద్దటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృష్టి చేస్తోందని..దీంట్లో భాగంగానే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించటానికి ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మించాలనుకుంటున్నామని దీని కోసం కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా సహకరించటంలేదంటూ ఆరోపించారు. కేంద్రాన్ని మర్యాదగానే అడుగుతున్నామని అయినా ఏమాత్రం సహకరించటంలేదన్నారు.

ఆ ప్రాంతాల్లో స్కైవే నిర్మాణానికి భూసేకరణ అవసరమనీ కానీ అక్కడ ఉన్నవి డిఫెన్స్ భూములు కావటంతో అభివృద్ధి పనులు అడుగు ముందుకు వేయలేకపోతున్నానమ అన్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలంటే ఆయా ప్రాంతాల్లో డిఫెన్స్ భూములు ఉండటం వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నామని దీని గురించి డిఫెన్స్ (కేంద్ర రక్షణ శాఖ) మినిస్టర్ ను కలిసి వినతిపత్రాలు ఇచ్చామని అలాగే ప్రధాన మంత్రి మోడీకి కూడా విన్నవించుకున్నామని..అయినా కేంద్రం నుంచి ఎటువంటి సహకారాలు అందటంలేదంటూ కేటీఆర్ తెలిపారు.

ఏడున్నర సంవత్సరాల నుంచి కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నామని అయినా ఏమాత్రం సహాయ సహకారాలు అందించటంలేదని రక్షణశాఖలో నలుగురు మంత్రులు మారారని..అలా మంత్రులు మారినప్పుడల్లా విజ్ఞప్తులు చేస్తునే ఉన్నామని అయినా ఎవ్వరినుంచి ఎటువంటి సానుకూల స్పందనా రాలేదని అసెంబ్లీలో కేటీఆర్ తెలిపారు.ఇదంతా కేంద్రం తెలంగాణ పట్ల వ్యవహరించే కక్షపూరిత ధోరణే అంటూ ఆరోపించారు.అలాగే రామగుండంవైపు పోయే స్టేట్ హైవే విషయంలో కూడా అదే సమస్య ఉందన్నారు. అలాగే జూబ్లీ బస్టాండ్ నుంచి షామీర్ పేట వరకు స్కైవే నిర్మించటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అక్కడ కూడా డిఫెన్స్ భూములు ఆటంకం ఎదురవుతోందన్నారు.



 

ట్రెండింగ్ వార్తలు