తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పబ్లిక్ ఎగ్జిబిషన్.. ఉచితంగా బస్సులో వెళ్లి, ఫ్రీగా చూసేయండి..

ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్‌బీ నగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి ఉచిత బస్సు సేవలు ఉంటాయి.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పబ్లిక్ ఎగ్జిబిషన్.. ఉచితంగా బస్సులో వెళ్లి, ఫ్రీగా చూసేయండి..

Updated On : December 9, 2025 / 7:52 PM IST

Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో ఇవాళ సెషన్లు ముగిశాయి. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజలు మూడు రోజుల పాటు ఉచితంగా చూసే అవకాశం ఇస్తోంది తెలంగాణ సర్కారు. పబ్లిక్ ఎగ్జిబిషన్‌కు వెళ్లేందుకు బస్సులను కూడా ఏర్పాట్లు చేస్తోంది. వాటిల్లో ఫ్రీగా వెళ్లి చూసేయండి.

తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలు, గ్లోబల్ విజన్‌ను దగ్గరగా చూసే అద్భుత అవకాశం కల్పిస్తున్నామని తెలంగాణ సర్కారు ప్రకటన చేసింది. భవిష్యత్తు ప్రాజెక్టులపై సెషన్లు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించింది.

Also Read: హైదరాబాద్‌లో బీచ్‌..! 35 ఎకరాల్లో.. మనం సముద్ర తీరాల వరకు వెళ్లనక్కర్లేదు..

డిసెంబర్ 10 నుంచి 13 వరకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రవేశాలు అందరికీ ఉచితమని వివరించింది. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్‌బీ నగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి ఉచిత బస్సు సేవలు ఉంటాయని చెప్పింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు (వెళ్లేందుకు), సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు (తిరిగి వచ్చేందుకు) ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.