హైదరాబాద్‌లో బీచ్‌..! 35 ఎకరాల్లో.. మనం సముద్ర తీరాల వరకు వెళ్లనక్కర్లేదు..

అలాగే, దుబాయ్‌, సింగపూర్‌ తరహాలో టన్నెల్‌ అక్వేరియం ఏర్పాటు చేయాలని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి.

హైదరాబాద్‌లో బీచ్‌..! 35 ఎకరాల్లో.. మనం సముద్ర తీరాల వరకు వెళ్లనక్కర్లేదు..

Updated On : December 9, 2025 / 7:24 PM IST

Hyderabad: హైదరాబాదీలు బీచ్‌లకు వెళ్లాలంటే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కోటి మంది జనాభాను దాటిపోయిన హైదరాబాద్‌లో బీచ్‌ ఉంటే ఎలా ఉంటుంది? సముద్రం లేకపోతే బీచ్‌ ఎలా వస్తుందని అనుకుంటున్నారా? కృత్రిమ బీచ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

235 కోట్ల రూపాయలతో కొత్వాల్‌గూడలో 35 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే, దుబాయ్‌, సింగపూర్‌ తరహాలో టన్నెల్‌ అక్వేరియం ఏర్పాటు చేయాలని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి.

ఫ్లయింగ్‌ థియేటర్‌తో పాటు టన్నెల్‌ అక్వేరియం, సాంస్కృతిక ఈవెంట్లు నిర్వహించేందుకు కల్చరల్‌ సెంటర్‌, వికారాబాద్‌లో క్యారవాన్‌ పార్కు నిర్మించనున్నారు. ఇవాళ ముగిసిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా పలు సంస్థలు ఈ మేరకు ఒప్పందాలు చేసుకున్నాయి.

ప్రాజెక్టు పార్ట్‌నర్‌ హరి దామెర తాజాగా మాట్లాడుతూ.. 35 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ బీచ్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బీచ్‌లో ప్రజలు బీచ్‌లో హాయిగా గడపవచ్చని, డిస్టినేషన్‌ వెడ్డింగ్‌ కేంద్రాల వంటివి కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. రూ.200 వరకు టికెట్‌ ఫీజు ఉంటుందని తెలిపారు.

ఇక టన్నెల్‌ అక్వేరియం ఏర్పాటు చేస్తే నీటి అడుగున టూరిస్టులు నడుస్తూ జలచరాలను చూసే ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు. దీన్ని కెడార్‌ సంస్థ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.