Munugode by Poll : రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని మునుగోడు కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేధిస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ నేతలు మండిపడ్డతున్నారు.

Munugode by Poll : రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని మునుగోడు కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Munugode by Poll :

Munugode by Poll : ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇంకా ఉప ఎన్నిక తేదీ అయితే ఖరారు కాలేదుగానీ..మునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. మునుగోడులో గెలుపే ప్రధానంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థి విషయంలో కసరత్తులు చేస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరటం..ఉప ఎన్నిక రావటం..ఆ ఎన్నికలో కూడా రాజగోపాల్ రెడ్డికే మద్ధతు ఇవ్వాలంటూ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాభీయింగులు చేస్తున్నారా? కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీలో చేరిన తమ్ముడికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా? అంటే నిజమేనంటున్నారు మునుగోడు కాంగ్రెస్ నేతలు. మునుగోడులోని కాంగ్రెస్ నేతలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్లు చేసి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికే మద్దతు ఇవ్వాలని వేధిస్తున్నారని..బెదిరిస్తున్నారని అంటున్నారు మునుగోడు కాంగ్రెస్ నేతలు.

కోమటిరెడ్డివెంకట్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మునుగోడు కాంగ్రెస్ నేతలు. ఈ ఫోన్ల వేధింపులపై మునుగోడు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో ఎంపీగా కొనసాగుతూ వెంకట్ రెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు కూడగడుతున్నారంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారో..లేదా సోదరుడిలా బీజేపీలోకి చేరతారో నిర్ణయించుకోవాలని..అంతేతప్ప తమకు ఫోన్లు చేసి వేధించవద్దని హెచ్చరిస్తున్నారు.

కాగా..రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ అధిష్టానం  నియమించిననాటినుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సోదరులలో ఏ ఒక్కిరికి ఆ పదవి దక్కుతుందని ఆశించారు. కానీ అలా కాకుండా టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవిని కట్టబెట్టటాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి అంటేనే మండిపడుతుంటారు కోమటిరెడ్డి బ్రదర్స్. తామ సీనియర్స్ అని..నిన్నకాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి పీసీసీ పదవిలో ఉంటే ఆయన కింద తాము పనిచేయటం ఏంటనే అభిప్రాయంతో ఉన్నారు. ఈక్రమంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఇక వెంకట్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లిపోతారనే వార్తలు వచ్చాయి. కానీ ఆయనమాత్రం కాంగ్రెస్ లో ఉంటూనే సోదరుడికి మద్దతు కూడగడుతున్నారని మునుగోడు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని మండిపడుతున్నారు.