Swimming Pool Boy Died : నాగోల్ స్విమ్మింగ్ పూల్ బాలుడు మృతి కేసు.. అనుమతుల్లేవని తేల్చిన జీహెచ్ఎంసీ

నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్‌ స్విమ్మింగ్‌పూల్‌లో పడి.. బాలుడు మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్విమ్మింగ్‌ పూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. పదేళ్ల బాలుడు మృతి చెందినట్లు తేల్చిన పోలీసులు.. నిర్వాహకుడు అశోక్‌ను అరెస్టు చేశారు.

Swimming Pool Boy Died : నాగోల్ స్విమ్మింగ్ పూల్ బాలుడు మృతి కేసు.. అనుమతుల్లేవని తేల్చిన జీహెచ్ఎంసీ

Swimming Pool

Swimming Pool Boy Died : హైదరాబాద్ నాగోల్ స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. స్విమ్మింగ్ పూల్ లో బాలుడు మృతి కేసుపై ముమ్మర దర్యాప్తు సాగుతోంది. ఈ నేపథ్యంలో స్విమ్మింగ్ పూల్ కు అనుమతులు లేవని జీహెచ్ఎంసీ తేల్చింది. దీంతో బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ ను జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ చేశారు. నిన్న స్విమ్మింగ్ పూల్ లో పడి మనోజ్ అనే పదేళ్ల బాలుడు మృతి చెందాడు. జీహెచ్ఎంసీ డిప్యూటీ డైరెక్టర్ సుకేశ్ రెడ్డి 10టీవీతో మాట్లాడుతూ అనుమతి లేని స్విమ్మింగ్ పూల్ ను సీజ్ చేశామని తెలిపారు. 3 సంవత్సరాలుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ నడుస్తుందనేది తమ దృష్టికి రాలేదన్నారు.

స్విమ్మింగ్ పూల్ నడిపించాలంటే కచ్చితంగా అనుమతి తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. స్విమ్మింగ్ పూల్ పెట్టాలంటే జీహెచ్ఎంసీ అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్ కోసం ఆన్ లైన్ లో అనుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆన్ లైన్ లో అప్లై చేసుకుంటే తాము వెరిఫై చేస్తామని చెప్పారు. అనుమతులు లేని స్విమ్మింగ్ పూల్స్ పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటి పోలీస్ కేసు నమోదు అయ్యిందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ సీజ్ చేశామని వెల్లడించారు.

swimming pool: స్విమ్మింగ్‌పూల్‌లో బాలుడు మృతిపై తల్లిదండ్రుల ఆందోళన.. ఉద్రిక్తత

నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్‌ స్విమ్మింగ్‌పూల్‌లో పడి.. బాలుడు మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్విమ్మింగ్‌ పూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. పదేళ్ల బాలుడు మృతి చెందినట్లు తేల్చిన పోలీసులు.. నిర్వాహకుడు అశోక్‌ను అరెస్టు చేశారు. ఇవాళ బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు ఉస్మానియా వైద్యులు. అయితే.. ఈ ఘటనపై బ్లూ ఫ్యాబ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వాహకులు ఇంతవరకూ స్పందించలేదంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. తమ బిడ్డ చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సమ్మర్‌లో సరదాగా స్విమ్మింగ్‌కు వెళ్లడమే ఆ బాలుడికి శాపంగా మారింది. స్విమ్మింగ్‌పూల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యంతో పదేళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పిల్లాడికి ఈత నేర్పించేటప్పుడు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు స్విమ్మింగ్‌పూల్‌ ఓనర్లు. దీంతో నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు పదేళ్ల మనోజ్‌. హైదరాబాద్‌ నాగోల్‌లో ఈ విషాదం జరిగింది.

Boy Dies In SwimmingPool : బాలుడిని బలితీసుకున్న స్విమ్మింగ్ పూల్.. నాగోల్‌లో తీవ్ర విషాదం

నాగోల్‌ సమతాపురి కాలనీలోని బ్లూఫ్యాబ్‌ స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి పదేళ్ల బాలుడు మనోజ్‌ మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. లింగంపల్లిలో ఉండే మనోజ్‌.. సమ్మర్‌ హాలిడేస్‌ కావడంతో నాగోల్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. సమతాపురి కాలనీలోని బ్లూఫ్యాబ్‌ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత నేర్చుకునేందుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు. తోటి స్విమ్మర్లు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారు.