Telangana Cabinet Key Decisions : కొత్తగా 10లక్షల పెన్షన్లు, 5వేల పోస్టులు భర్తీ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

సీఎం కేసీఆర్ అధ్యక్షత భేటీ అయిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 5వేల 111 అంగన్ వాడీ, ఆయాల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 15 నుంచి 10 లక్షల కొత్త పెన్షన్ల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21న తలపెట్టిన అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలను రద్దు చేసింది.

Telangana Cabinet Key Decisions : కొత్తగా 10లక్షల పెన్షన్లు, 5వేల పోస్టులు భర్తీ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

Telangana Cabinet Key Decisions : సీఎం కేసీఆర్ అధ్యక్షత భేటీ అయిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 5వేల 111 అంగన్ వాడీ, ఆయాల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 15 నుంచి 10 లక్షల కొత్త పెన్షన్ల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21న తలపెట్టిన అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలను రద్దు చేసింది.

ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 75మంది ఖైదీల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు కోఠి, ఈఎన్టీ ఆసుపత్రులకు పది మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.

ఈఎన్టీ, సరోజినీ దేవి కంటి ఆసుపత్రుల్లో అధునాతన టవర్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయించింది. గ్రామకంఠంలో ఇళ్ల నిర్మాణాల సమస్యలు తొలగించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది కేబినెట్. వికారాబాద్ లో ఆటోనగర్ నిర్మాణానికి 1 ఎకరాలు, తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాలు కేటాయించింది కేబినెట్. మరోవైపు జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు సీఎం కేసీఆర్.

ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. దీంతో పెన్షన్ దారుల సంఖ్య 46 లక్షలకు పెరిగింది. మరోవైపు ఈ నెల 21న పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల పెద్ద ఎత్తున వివాహాది శుభకార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని నిర్ణయం తీసుకుంది.