Tirumala Brahmotsavam 2025 Dates: తిరుమల బ్రహ్మోత్సవాల తేదీలు వచ్చేశాయ్.. గరుడసేవ డేట్ ఇదే..

భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈవో ఆదేశించారు.

Tirumala Brahmotsavam 2025 Dates: శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామల రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో జిల్లా యంత్రాంగంతో సమావేశం అయ్యారు.

సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ లతో సమీక్ష నిర్వహించిన ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సెప్టెంబర్ 2న ధ్వజారోహణం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 28న గరుడ సేవ ఉంటుంది.

అక్టోబర్ 2న చక్రస్నానం ఉంటుంది. భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈవో ఆదేశించారు.

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలన్నారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో జిల్లా పోలీసులతో సమన్వయంతో భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో ఆదేశించారు.

తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఈఓ చెప్పారు.

Also Read: ఓమైగాడ్.. బ్రెయిన్ తినేస్తున్న అమీబా.. ఆల్రెడీ 9 ఏళ్ల బాలిక మృతి.. ఏంటీ అమీబా? ఎలా వస్తుంది?