Vegetable Cultivation : ప్రకృతి విధానంలో కూరగాయల సాగుతో స్వయం ఉపాధి పొందుతున్న రైతు

ఎలాంటి రసాయ మందులు వినియోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నారు. దీంతో వినియోగదారులు నేరుగా ఇంటి వద్దకు వచ్చి దిగుబడులను కొనుగోలు చేసుకుంటున్నారు.

Cultivation of Vegetables

Vegetable Cultivation : రసాయనిక ఎరువులతో పండించిన కూరగాయ తిని విసిగి పోయిన ప్రజలు.. కాస్త ధర ఎక్కువైన సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల వైపే మెగ్గు చూపుతున్నారు. దీనినే వ్యాపార మార్గంగా మలుచుకున్నాడు ఓ రైతు. ఉన్నకొద్దిపాటి స్థలంలో సహాజ సిద్ధంగా కూరగాయలు పండిస్తూ…  వినియోగదారుడికి అందిస్తూ.. స్వయం ఉపాధి పొందుతున్నారు .

READ ALSO : Leafy Greens : ఆరోగ్యానికి ఆకు కూరలు అవసరమే! పోషకాలతో కూడిన వీటిని రోజువారిగా తీసుకుంటే?

ఆలోచనకు శ్రమతో కూడిన ఆచరణ తోడైతే విజయం సాధించవచ్చు అనటానికి నిదర్శనం ఈ రైతు. పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి ముందడగు వేస్తే ఒడిదుడుకులు ఎదురైనా విజయం సొంతం అవుతుందనే సూత్రాన్ని ఈయన బాగా నమ్మారు. అందుకే తనకున్న కొద్దిపాటి భూమిలో కాయగూరలు, ఆకుకూరలు, పండ్లను ప్రకృతి విధానంలో సాగుచేస్తూ… మంచి దిగుబడులను పొందుతున్నారు కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం, రామానగరం సెంటర్ కు చెందిన రైతు సాంబశివరావు. అంతే కాదు చుట్టుప్రక్కల ప్రకృతి విధానంలో పంటలు పండించిన రైతుల వద్దనుండి పంట దిగుబడులను కొనుగోలు చేసి తన ఇంటి వద్దే ఒక స్టాల్ ఏర్పాటు చేసి వినియోగదారులకు అందిస్తూ.. స్వయం ఉపాధి పొందుతున్నారు.

READ ALSO : ఆకు కూరలు తింటే.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

ఎలాంటి రసాయ మందులు వినియోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నారు. దీంతో వినియోగదారులు నేరుగా ఇంటి వద్దకు వచ్చి దిగుబడులను కొనుగోలు చేసుకుంటున్నారు. అలాగే ఆసక్తి ఉన్నవారికి పొలంలో తిప్పి చూపుతూ… సహజ సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు రైతు.