Micronutrients In Peanuts : వేరుశెనగలో సూక్ష్మ పోషకాలతోపాటు, కలుపు నివారణకు రైతులు చేపట్టాల్సిన చర్యలు!
జింకు లోపిస్తే పైరు ఆకులు చిన్నవిగా మారిపోయి గుబురుగా కనిపిస్తాయి. మొక్కలు గిడసబారిపోతాయి., ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. ఈ లోపాన్ని సవరించటానికి ఎకరాకు 400గ్రా చొప్పున జింక్ సల్ఫేట్ ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

Micronutrients In Peanuts :
Micronutrients In Peanuts : రాష్ట్రాల్లో వేరుశెనగ పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఉత్తర కోస్తా, దక్షిణ తెలంగాణా, దక్షిణ తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లో రైతులు ఖరాఫ్, రబీలలో వేరుశెనగ పంటను సాగు చేస్తున్నారు. ఇసుకతో కూడిన గరపనేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి, చల్కా, ఎర్రగరప నేలలు కూడా అనుకూలమే. నల్ల రేగడి నేలలు అంత అనుకూలం కాదు. వేరుశెనగ పంటలో మంచి దిగుబడులు సాధించాలంటే సూక్ష్మ పోషకాలు చాలా కీలకం. వీటిలోపం ఏర్పడితే దిగుబడులు తగ్గటంతోపాటు పంట తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కలుపు నివారణ సైతం చాలా ముఖ్యమైనది. ఈ రెండింటి విషయంలో రైతలు ప్రత్యేక చర్యలు తీసుకోవటం ద్వారా ఆశించిన మేర దిగుబడులు పొందవచ్చు.
వేరుశెనగలో సూక్ష్మ పోషకాల నివారణ ;
జింకు లోపిస్తే పైరు ఆకులు చిన్నవిగా మారిపోయి గుబురుగా కనిపిస్తాయి. మొక్కలు గిడసబారిపోతాయి., ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. ఈ లోపాన్ని సవరించటానికి ఎకరాకు 400గ్రా చొప్పున జింక్ సల్ఫేట్ ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. ఇనుముథాతులోపం నల్లరేగడి నేలల్లో అధిక తేమ ఉంటే ఏర్పడుతుంది. లేత ఆకులు పసుపు పచ్చగా తరువాత తెలుపు రంగుకు మారతాయి. ఈ లోపాన్ని అదిగమించటానికి ఎకరానికి 1 కిలో అన్నభేది మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. నీటి పారుదల కింద సాగు చేసే పంటకు ఎకరానికి 4 కిలోల బోరాక్స్ ను విత్తే సమయంలో వేసుకోవాలి. బోరాన్ గింజల అభివృద్ధికి తోడ్పడుతుంది.
కలుపు నివారణ చర్యలు ;
కలుపు మొలతెక్తక ముందే చర్యలు తీసుకోవటం మంచిది. ముందుగా కలుపు నివారణకు అలాక్లోర్ 50 శాతం ఎకరాకు ఒక లీటరు 1.3, 1.6లీ లేదా బుటాక్లోర్ 50శాతం 1.25, 1.5 లీ చొప్పున ఏదో ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనేగాని లేదా 3 రోజుల లోపల నేలపై పిచికారి చేయాలి. విత్తిన 25 రోజుల సమయంలో గొర్రుతో అంతరకృషి చేయాలి. మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజల లోపు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. 45 రోజుల తర్వాత ఏవిధమైన అంతర కృషి చేయకూడాదు. అలా చేయటం వల్ల మొక్క ఊడలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.