Vodafone Idea : పండగ చేస్కోండి.. Vi స్పెషల్ ఆఫర్ కేక.. రూ. 4,999 ఏడాది ప్లాన్ జస్ట్ రూ.1కే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Vodafone Idea : వోడాఫోన్ ఐడియా స్పెషల్ ఆఫర్ అదిరింది.. రూ. 4,999 ప్లాన్ కేవలం రూ.1కే ఆఫర్ చేస్తోంది. ఎలా పొందాలంటే?

Vodafone Idea : పండగ చేస్కోండి.. Vi స్పెషల్ ఆఫర్ కేక.. రూ. 4,999 ఏడాది ప్లాన్ జస్ట్ రూ.1కే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Vodafone Idea

Updated On : August 25, 2025 / 6:20 PM IST

Vodafone Idea : వోడాఫోన్ ఐడియా యూజర్లకు బంపర్ ఆఫర్.. కేవలం రూ. 1కే ప్రీమియం యానివల్ రీఛార్జ్ ప్లాన్ పొందవచ్చు. వోడాఫోన్-ఐడియా (Vodafone Idea) తమ యూజర్ల కోసం ఈ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ప్రీమియం వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ ధర రూ.4,999 ఉండగా ఇప్పుడు కేవలం ఒక రూపాయికే గెలుచుకోవచ్చు.

ఈ ప్లాన్ ఏడాది మొత్తం అన్ లిమిటెడ్ కాలింగ్, 2GB రోజువారీ డేటా, ఏడాదికి ఫ్రీగా SMS, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, 16 OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌తో వస్తుంది. రీఛార్జ్ ప్లాన్‌ను యాక్సెస్ చేయాలనుకునే యూజర్లు ఈ యాప్ లో గెలాక్సీ షూటర్స్ గేమ్ నుంచి 31 ఆగస్టు 2025 వరకు మాత్రమే పొందగలరు.

వోడాఫోన్ ఐడియా ఆఫర్ ఇదే :
ప్రముఖ టెలికాం కంపెనీ తమ కస్టమర్ల కోసం స్పెషల్ గేమ్ ఆధారిత ప్రమోషనల్ ఆఫర్‌ను అందిస్తోంది. వోడాఫోన్ ఐడియా (Vi) అధికారిక బ్లాగ్ ప్రకారం.. వినియోగదారులు Vi యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను యాక్సెస్ చేయవచ్చు.

గెలాక్సీ షూటర్స్ గేమ్ ఆడటం ద్వారా వినియోగదారులు డ్రోన్‌లను ఫైర్ చేసి జెమ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సేకరించిన జెమ్స్ సంఖ్య ఆధారంగా వివిధ రివార్డులను అన్‌లాక్ చేయవచ్చు. అమెజాన్ వోచర్‌ల నుంచి ప్రీమియం డేటా ప్యాక్, టాప్-ఎండ్ వార్షిక రీఛార్జ్ ప్లాన్ వరకు కలెక్టెడ్ జెమ్స్ ఆధారంగా గిఫ్ట్స్ పొందొచ్చు.

Read Also : Lava Play Ultra 5G : లావా ప్లే అల్ట్రా 5G గేమింగ్ ఫోన్ సేల్ మొదలైందోచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు.. డోంట్ మిస్..!

25 జెమ్స్ : రూ. 50 విలువైన అమెజాన్ గిఫ్ట్ వోచర్ (300 మంది విజేతలకు)
75 జెమ్స్ : రూ.1కి 10GB డేటా, Vi మూవీస్, టీవీ ద్వారా 16 OTT యాప్‌లకు యాక్సెస్ (30 మంది విజేతలకు)
150 జెమ్స్ : కేవలం రూ. 1కి రూ.348 విలువైన 50GB డేటా ప్యాక్ (28 రోజుల వ్యాలిడిటీ, 30 మంది విజేతలు)
300 జెమ్స్ : కేవలం రూ. 1కే రూ.4,999 విలువైన వార్షిక రీఛార్జ్ ప్లాన్ (అమెజాన్ ప్రైమ్ + 16 OTT యాప్‌లు, 15 విజేతలు)
ఆసక్తిగల యూజర్లు 31 ఆగస్టు 2025 వరకు ఈ ఆఫర్‌ ద్వారా పొందవచ్చు.

రూ. 4,999 రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ :
వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీమియం వార్షిక రీఛార్జ్ ప్యాక్ అందిస్తోంది.

వ్యాలిడిటీ : 365 రోజులు
కాలింగ్ : అన్ని నెట్‌వర్క్‌లలో అన్ లిమిటెడ్ కాలింగ్
డేటా : ఏడాదిలో రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
SMS : రోజుకు 100 ఉచితంగా SMS
ఎంటరైన్మెంట్ : ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్
OTT యాక్సెస్ : Vi మూవీస్, టీవీ యాప్ ద్వారా 16 OTT ప్లాట్‌ఫామ్‌లకు ఫ్రీ యాక్సెస్