Bananna Cultivation : ఆయిల్ ఫాంలో అంతర పంటగా అరటి సాగు

Bananna Cultivation : ఈ కోవలోనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు ఆయిల్ ఫామ్ తోటలో అంతర పంటగా అరటిని సాగుచేస్తూ.. సత్ఫలితాలను పొందుతున్నారు.

Bananna Cultivation Between Palm Trees

Bananna Cultivation Between Palm Trees : తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్. అయితే నాటిన మూడెళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక, రైతులు మొదటి రెండు మూడు ఏళ్లు మాత్రమే అంతర పంటలు సాగుచేస్తుంటారు. ఈ కోవలోనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు ఆయిల్ ఫామ్ తోటలో అంతర పంటగా అరటిని సాగుచేస్తూ.. సత్ఫలితాలను పొందుతున్నారు. అంతే కాదు పంట సాగు విధానాల పట్ల చుట్టుప్రక్కల రైతులకు అవాగాహన కల్పిస్తున్నారు.

Read Also : Guava Cultivation : జామతోటల్లో దిగుబడులు పెంచే చర్యలు

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ అరటి తోటను చూడండీ.. మధ్య మధ్యలో ఆయిల్ ఫామ్ మొక్కలు కూడా ఉన్నాయి కదూ.. ఈ క్షేత్రం మంచిర్యాల జిల్లా, దండెంపల్లి మండలం, వెల్గనూర్ గ్రామంలో ఉంది. దీనిని సాగుచేస్తున్న ఈ రైతుపేరే మేడిశెట్టి మహేందర్.  ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసిన ఈయన కొన్నేళ్ల పాటు పలు వ్యవసాయ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. అయితే వ్యవసాయంపై తనకు మక్కువ ఉండటం.. ఇటు తెలంగాణలో పామాయిల్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిచడంతో ఉద్యోగానికి రాజీనామ చేసి , తనకున్న 6 ఎకరాల్లో ఫామ్ మొక్కలను నాటారు.

ఆయిల్ ఫాంలో అరటి సాగు : 
మొదటి మూడేళ్ల పాటు ఎలాంటి దిగుబడులు రావు కనుక.. అంతర పంటగా గ్రాండ్ 9 రకం అరటిని ఎంచుకున్నారు. ఎకరాకు 1400 మొక్కల చొప్పున నాటారు. ప్రస్తుతం అరటి గెలలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా 3 ఏళ్లపాగు అరటి నుండి దిగుబడిని పొందుతూ.. నాలువ ఏడాది నుండి ప్రధాన పంట అయిన ఆయిల్ ఫాంనుండి దిగుబడి తీసుకుంటానని చెబుతున్నారు. అంతే కాదు .. చుట్టుప్రక్కల రైతులకు పంటల సాగులో అధిక దిగుబడుల కోసం సలహాలు , సూచనలు అందిస్తున్నారు.

Read Also : Mirchi Crop Cultivation : మిరపను కోసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

ట్రెండింగ్ వార్తలు