Guava Cultivation : జామతోటల్లో దిగుబడులు పెంచే చర్యలు

Guava Cultivation : పేదవాడి యాపిల్‌గా పిలిచే జామకు నానాటికీ గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామపండ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.

Guava Cultivation : జామతోటల్లో దిగుబడులు పెంచే చర్యలు

Growth Performance of Guava Cultivation

Updated On : January 31, 2024 / 11:16 PM IST

Guava Cultivation : ఒకసారి నాటితే తరతరాలకు ఫలసాయాన్నిచ్చేవి పండ్లతోటలు. జామనే తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. నాటిన 2-3 సంవత్సరాలకే మంచి దిగుబడితో, రైతును ఆర్థికంగా ఆదుకుంటుంది. ప్రస్తుతం శీతాకాలం పంట చివరి దశలో ఉంది. తరువాత పంట దిగుబడులను పెంపొందించుకోవటం కోసం ఈ సమయంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు  ప్రధాన శాస్త్రవేత్త, డా.  భగవాన్.

Read Also : Rabi Sesame Cultivation : రబీ నువ్వు సాగు యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు

ఫిబ్రవరి నుండి మే వరకు నీటితడులు ఆపాలి :
పేదవాడి యాపిల్‌గా పిలిచే జామకు నానాటికీ గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామపండ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్‌ ఉండటంతో రైతులు కొత్త వె రైటీ జామను సాగుచేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు.

సాగులో అందివస్తున్న నూతన శాస్త్రపరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు . ముఖ్యంగా జామా ఏడాదికి మూడు పంటలు వస్తాయి. ప్రస్తుతం శీతాకాలం పంట పూర్తైంది. తోటల్లో కొన్ని యాజమాన్య లోపాల వల్ల  దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే పంటలో  సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్తలు.

జూన్ మొదటి వారంలో నీరుపెట్టాలి
ఎరువులు కూడా వేయాలి

జామతోటల్లో యాజమాన్యం
5 సం. రాలు పైబడిన
ప్రతి చెట్టుకు 500 గ్రా. యూరియా
500 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి

జామతోటల్లో యాజమాన్యం
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిమ్మకాయ సైజులో కాయ ఉన్నప్పుడు

జామతోటల్లో యాజమాన్యం
పొటాషియం నైట్రేట్ 10 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

Read Also : Pulses Cultivation : వేసవి అపరాల సాగులో మెళకువలు – అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం