Betel Leaves Cultivation : కొబ్బరిలో అంతర పంటగా తమలపాకు సాగు.. లాభాలు బాగు

Betel Leaves Cultivation : ఒక్కసారి మొక్కను నాటితే రెండు నుంచి మూడేళ్ల వరకు దిగుబడి వస్తుంది. తమలపాకు సాగు అంటే అంత సులువు కాదు. ఎంతో కష్టంతో కూడుకున్నది. 

Betel Leaves Cultivation Telugu : తమలపాకు లేనిదే ఏ పండుగ.. శుభకార్యం జరగదు. ప్రతి శుభకార్యంలో, దేవుళ్ల వద్ద పూజలకు మనం ఎక్కువగా ఈ ఆకులను ఉపయోగిస్తాము. అంతే కాదు తమలపాకును లక్ష్మీ దేవికి సమానంగా భావిస్తారు. అందుకే ఈ తమలపాకుకు మన సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది.  అంతటి ప్రాధాన్యత గల తమలపాకు సాగు విధానం సైతం ఎంతో ప్రత్యేకంగా సాగుచేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో ఏళ్లుగా తమలపాకును సాగుచేస్తూ ఉపాధి పొందుతున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు.

Read Also : Green Black Gram Cultivation : వేసవి పెసర, మినుము సాగు యాజమాన్యం

ఏ శుభాకార్యాలకైనా మొదటి స్థానం తమలపాకుదే. అందుకే చాలామంది రైతులు తమలపాకుల సాగును తరతరాలుగా చేపడుతూనే ఉన్నారు. ఇకోవలోకే వస్తారు పశ్చిమగోదావరి జిల్లా, ఎలమంచిలి మండలం , అబ్బిరాజు పాలెం కు చెందిన రైతు నంబూల రంగారావు. ఒక్కసారి మొక్కను నాటితే రెండు నుంచి మూడేళ్ల వరకు దిగుబడి వస్తుంది. తమలపాకు సాగు అంటే అంత సులువు కాదు. ఎంతో కష్టంతో కూడుకున్నది.

ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలు సాగుకు పనికి రావు. అలాగే వాతావరణం సహాకరించాలి.. సంవత్సరం పొడవునా  నీటి వసతి సౌకర్యం ఉండాలి. అవగాహన కలిగి సాగుబడి చేస్తే లక్ష్మీదేవి వెంట ఉన్నట్లే అంటుంటారు పెద్దలు. తోటలకు ముఖ్యంగా వేరు కుళ్లు రోగాలు వచ్చి తీగలు, ఆకులు పసుపు పచ్చ రంగులోకి వచ్చి చచ్చిపోతాయి. ఒక్క ఎకరం సాగుకు లక్షల రూపాయలు పైనే ఖర్చులు చేయాల్సి వస్తుంటుంది.

తమలపాకు తోటల్లో ప్రతినిత్యం పనే ఉంటుంది. సరైన అవగాహన ఉండి, అదునుకు తగ్గట్టు సాగుపనులు చేసుకుంటే ఆదాయం ఉంటుంది. వచ్చిన దిగుబడిని ఎక్కువగా మహారాష్ట్ర మార్కెట్‌కు తరలిస్తున్నారు రైతు. ఒక్కో బుట్ట తమలపాకుల ఉత్పత్తికి దాదాపు 500 ఖర్చు అవుతుంది. ఆపై వస్తేనే రైతుకు మంచి లాభం అన్నమాట. సరుకు, డిమాండ్ ను బట్టి ఒక్కో సారి ఒక్కో బుట్ట వెయ్యి రూపాయల పైనే పలుకుతుంది.

Read Also : Quail Birds Farming : కౌజు పిట్టలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ – నిరుద్యోగులకు ఉపాధినిస్తున్న పెంపకం 

ట్రెండింగ్ వార్తలు