Quail Birds Farming : కౌజు పిట్టలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ – నిరుద్యోగులకు ఉపాధినిస్తున్న పెంపకం 

Quail Birds Farming : ఈ పక్షులను మార్కెట్ చేసే అవకాశం వుండటంతో రైతులకు వీటి పెంపకం అన్నివిధాలా అనుకూలంగా మారింది. క్వయిల్ పక్షుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు.

Quail Birds Farming : కౌజు పిట్టలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ – నిరుద్యోగులకు ఉపాధినిస్తున్న పెంపకం 

Quail Birds Farming

Updated On : March 23, 2024 / 2:39 PM IST

Quail Birds Farming : క్వయిల్ పక్షలు పెంపకం సన్న, చిన్నకారు రైతులకు, నిరుద్యోగయువతకు  ఉపాధినిచ్చే పరిశ్రమగా , మంచి ఆదరణ పొందుతోంది.  దేశంలో చాలా చోట్ల వీటి గ్రుడ్లకు, మాంసానికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. కొద్దిపాటి స్ధలం, తక్కువ ఖర్చు, శ్రమతో ఐదారు వారాల్లోనే ఈ పక్షులను మార్కెట్ చేసే అవకాశం వుండటంతో రైతులకు వీటి పెంపకం అన్నివిధాలా అనుకూలంగా మారింది. క్వయిల్ పక్షుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని పీవి నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. గుర్రం శ్రీనివాస్.

Read Also : Green Black Gram Cultivation : వేసవి పెసర, మినుము సాగు యాజమాన్యం

మార్కెట్‌లో మాంసానికి విపరీతమైన డిమాండ్‌ ఉంది.  పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడంలేదు. మాంసాహారం కొరకు జంతువులను, పక్షులను పెంచడము అనాదిగా వస్తున్నది. కాని పక్షుల విషయంలో అనాదిగా వున్నది కోళ్ళను పెంచడము. కోళ్ళలో బ్రాయిలర్ కోళ్ళు, గ్రుడ్లు పెట్టే కోళ్ళు, గినీ కోళ్ళు, నీటీ కోళ్ళు, ఈము పక్షులు, క్వయిల్ పక్షుల పెంపకం చేపడుతున్నారు. ఇందులో  ముఖ్యంగా  క్వయిల్ పక్షుల మాంసానికి విపరీతమైన డిమాండ్‌ ఉంది.  కోడిమాంసం కంటే కూడా మాంసం రుచిగా ఉండటం,  కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పిల్లలకు ఈ మాంసం, శరీర మరియు మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడటమే కాకుండా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, కౌజు పిట్ట మాంసం ఒక పౌష్టికాహారం.

మన పూర్వికులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులు , జీవాలు , కోళ్ళపెంపకాన్ని చేపట్టి ఆరోగ్యమైన జీవనాన్ని పొందేవారు. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పువచ్చి ఒకేపంట విధానాన్ని చేపట్టారు. అయితే ఇందులో మొదట్లో లాభాలు వచ్చినా.. రానురాను నష్టాలు అధికమవడంతో వాటిని పూడ్చుకునేందుకు అనుబంధ రంగాలలైన  మేకలు, గొర్రెల, ఆవులు, గేదెలు, కోళ్ల  పెంపకాన్ని చేపట్టారు.  అయితే సన్నా ,చిన్నకారు రైతులు అంత పెట్టుబడి పెట్టలేక పోవడం, పౌల్ట్రీకి అనుబంధంగా  కౌజు పిట్టల పెంపకం ఉండటం, మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో కౌజుపిట్టల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిపాటి స్థలం, తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే మార్కెట్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఇటు నిరుద్యోగులు సైతం మొగ్గుచూపుతున్నారు.

తక్కువ పెట్టుబడితో , అతి తక్కువ సమయంలోనే ఎదిగే ఈ క్వయిల్‌ పక్షుల పెంపకం చేపడితే మంచి లాభాలు ఉంటాయని  . ఒక కోడిని పెంచే స్థలంలో సుమారు 8 – 10 క్వయిల్‌ పక్షులను పెంచవచ్చు. ముఖ్యంగా గుడ్లనుండి పొదిగబడిన క్వయిల్ పిల్లలు చాలా చిన్నవిగా సున్నితంగా ఉంటాయి. పోషణకయ్యే ఖర్చు మొత్తం క్వయిల్ ల పెంపకానికయ్యే ఖర్చులో సుమారు 70 శాతం పైగా ఉంటుంది. మాంసానికి పెంచే క్వయిల్స్ 5 వారాల వయస్సు నుండి అమ్మటం ఉత్తమం.

మార్కెట్ కు అనుగునంగా క్వయిల్ పక్షుల పెంపకం చేపట్టి, వీటి పోషనలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.  వీటి పెంపకం చేపట్టాలనుకునే వారు కోళ్ళశాస్త్రవిభాగం, పశువైద్యకళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ వారిని సంప్రదించవచ్చన్నారు. ఫోన్‌ నెంబర్‌ 040 – 24015323 కి పనిదినాల్లో కాల్‌ చేయాల్సి ఉంటుంది.

Read Also : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం