Cassava Cultivation
Cassava Cultivation : ఆంధ్రప్రదేశ్ లో సాగవుతున్న దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలానికి విశిష్ఠ స్థానం వుంది. ప్రధానంగా ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలలో అధికంగా సాగుచేస్తున్నారు. సంవత్సరం పొడవునా సాగయ్యే ఈ కర్రపెండలాన్ని ముఖ్యంగా సగ్గుబియ్యం, గంజి పొడి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి రుచికరమైన ఆహారం కూడా. దీని దుంపలను ఉడకబెట్టి తింటారు. అయితే లోకల్ రకాల సాగుతో తక్కువ దిగబడినే పొందుతున్నారు రైతులు . ఇటీవల తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం ఉద్యాన పరిశోధనా స్థానం నుండి విడుదలైన రకాలు, వాటి గుణగణాలు, సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం..
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
వాణిజ్యసరళిలో సాగుచేసే దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలం ప్రధానమైంది. దేశవ్యాప్తంగా 5 లక్షల 70 వేల ఎకరాల్లో సాగులో వుంది. కర్రపెండలాన్ని కసావా లేదా టాపియోకా అంటారు. ఇది ఉష్ణమండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం సాగుకు అనుకూలంగా వుంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా , ఆరుతడి పంటగా సాగుచేయవచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.
READ ALSO : Cucumber Crop : దోసతోటలో బోరాన్ లోపం నివారణ
ఏజన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో వున్న ఈ పంటను, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్లో అధికంగా సాగుచేస్తున్నారు. జూన్ , జూలై మాసాల్లో ఈ దుంప పంటను సాగుచేస్తారు. డిసెంబరు నుంచి మార్చిలోపు దుంప తీతకు వస్తుంది. దీని పంట కాలం, రకాన్నిబట్టి 7 నుండి10నెలలు వుంటుంది. కర్రపెండలం దుంపల్లో పీచు పధార్ధంతో పాటు, పిండి పధార్ధం ఎక్కువగా వుంటుంది. వరి పండని ప్రాంతాల్లో, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని ప్రజలకు కర్రపెండలం ప్రధాన ఆహారం. దీని దుంపలనుంచి తయారుచేసే పౌడర్ ను వస్త్ర పరిశ్రమలో షైనింగ్ కోసం వాడతారు.
READ ALSO : Agarwood : చెట్లకు సెలైన్ లో విషం పెట్టి లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న రైతులు !
అలాగే సగ్గుబియ్యం, జిగురు తయారీ, పశువుల దాణా తయారీ పరిశ్రమల్లోను, ఇథనాల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. దుంపలు తియ్యగా వుంటాయి కనుక చిప్స్ తయారీలోను, వివిధ వంటకాల్లోను వాడుతున్నారు. అయితే పెద్దాపురం పెద్దాపురం డివిజన్ లో కర్రపెండలం దుంప లభ్యత వుండటంతో అనేక సగ్గుబియ్యం ఆధారిత పరిశ్రమలు ఇక్కడ కొలువుతీరాయి. మెట్టప్రాంతం ఎక్కువగా వుండటం, నీటి వసతి తక్కువగా వుండటంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గుచూపుతున్నారు. అయితే పాత రకాల సాగుతో అనుకున్నంత దిగుబడిని పొందలేక పోతున్నారు.
ఇటీవల పెద్దాపురం ఉద్యాన పరిశోధనా స్థానం నుండి విడుదలైన పి.డి.పి.సి.ఎం.ఆర్ – 1 రకంతోపాటు కేరళ, సిటీసిఆర్ ఐ నుండి విడుదలైన మరికోన్ని రకాలు, సాగు యాజమాన్య గురించి తెలియజేస్తున్నారు ఉద్యాన పరిశోధనా శాస్త్రవేత్త డా. జానకి. సంవత్సరంపాటు ఈ ఒక్క పంటే రైతులకు ఆధారం. కాబట్టి విత్తన ముచ్చేల ఎంపిక, నర్సరీ పెంపకం జాగ్రత్తగా చేపట్టాలి. పంట మొదటి 3 నెలలు సరైన సమయంలో , సరైన మోతాదులో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు నీటి తడులను ఇచ్చినట్లైతే దుంపలు బాగా ఊరి మంచి దిగుబడిని పొందవచ్చు.