Agarwood : చెట్లకు సెలైన్ లో విషం పెట్టి లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న రైతులు !

గత కొన్నేళ్లుగా మన దేశంలోని నాగాలాండ్, త్రిపుర లాంటి పలు రాష్ట్రాల్లో కూడా వీటిసాగు విస్తీర్ణం పెరిగింది. నాలుగైదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీటిసాగును పరిచయం చేస్తూ.. కలపను మార్కెటింగ్ చేస్తున్నారు యువకుడు సంపంగి ప్రసాద్. సాధారణంగా అంతరపంటలుగా దీర్ఘకాలిక మొక్కలైన శ్రీగంధం, ఎర్రచందనం లాంటి మొక్కలను నాటుతున్నారు.

Agarwood : చెట్లకు సెలైన్ లో విషం పెట్టి లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న రైతులు !

Poisoning the trees in saline.. profits in lakhs

Agarwood : కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, మడిచర్ల గ్రామానికి చెందిన రైతు నాదెండ్ల శ్రీనివాస్ ఆగర్ ఉడ్ సాగు చేపట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం అంతర పంటగా అగర్ ఉడ్ మొక్కలు నాటారు. ఇక్కడి వాతావరణం, నేల స్వభావం కారణంగా మొక్కలు ఆరోగ్యంగా, బలంగా పెరిగాయి. దీంతో ఆరేడు ఏళ్లకు చేయాల్సిన ఇనాక్యులేషన్ ప్రక్రియను ఇప్పుడే చేస్తున్నారు. ఇనాక్యులేషన్ అంటే ఫంగస్ ను చెట్లకు ఎక్కించడం అన్నమాట.

సాధారణంగా ఈ మొక్క కలప మామూలుగానే , ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. ఈ ఫంగస్ఎ క్కించినప్పుడు, తన రక్షణ కోసం ప్రత్యేకమైన రెజిన్ ను విడుదల చేస్తుంది. ఆ రెజిన్ తో కలిసిన కలప అత్యంత ఘాటైన సుంగంధ వాసనగా మారుతుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యులు సెలైన్ పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. కానీ పెద్ద పెద్ద సెలైన్లు తో ఆగర్ ఉడ్ చెట్లకు విషాన్ని ఎక్కించి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.

READ ALSO : Chilli Varieties : మిర్చిసాగులో అనువైన విత్తన రకాలు

చెట్లలో సుగంధభరిత కలపను మార్చేందుకు సెలైన్ ద్వారా ఫంగస్ ఎక్కించే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రెజిన్ ప్రభావంతో అలా మారిన హార్డ్ ఉండ్, సాఫ్ట్ ఉడ్ కు అరబ్ దేశాల్లో విపరీతమైన డిమాండ్. అందుకే మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా, తైవాన్, లావోస్, సింగపూర్ లాంటి దేశాల్లో ఈ మొక్కలను అధికంగా పెంచుతున్నారు.

గత కొన్నేళ్లుగా మన దేశంలోని నాగాలాండ్, త్రిపుర లాంటి పలు రాష్ట్రాల్లో కూడా వీటిసాగు విస్తీర్ణం పెరిగింది. నాలుగైదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీటిసాగును పరిచయం చేస్తూ.. కలపను మార్కెటింగ్ చేస్తున్నారు యువకుడు సంపంగి ప్రసాద్. సాధారణంగా అంతరపంటలుగా దీర్ఘకాలిక మొక్కలైన శ్రీగంధం, ఎర్రచందనం లాంటి మొక్కలను నాటుతున్నారు రైతులు.

అయితే అవి చేతికి రావాలంటే కనీసం 20 నుండి 25 సంవత్సరాల సమయం పడుతుంది. అదికూడా వాతావరణ పరిస్థితులు , నేలస్వభావం పైనే ఆధార పడి ఉంటుంది. కానీ అగర్ ఉడ్ లో కృత్రిమ పద్ధతిలో కేవలం తోమ్మిది పదేళ్లలోనే పంటచేతికి వస్తుంది. మార్కెటింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బైబ్యాక్ ఒప్పందం ఉండటంతో చాలా మంది రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు.

READ ALSO : Chili : మిరపలో చీడపీడల నివారణ

అగర్ ఉడ్ మొక్కలు అంతర పంటలుగా సాగుచేస్తే, ఎలాంటి అదరపు ఎరువులు, నీటితడులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 ఏళ్లలో 20 – 25 ఇంచుల చుట్టుకొలతతో.. 15నుండి 20 అడుతుల ఎత్తు పెరుగుతుంది. ఒక్కో చెట్టుకు వచ్చే హర్డ్ ఉడ్, సాఫ్ట్ ఉడ్ కు హీన పక్షంగా 10 నుండి 15 వేలు వచ్చినా.. ఎకరాకు 350 చెట్లకు దాదాపు 35 నుండి 40 లక్షలు ఎక్కడపోవు.. రైతులు ఒక్కసారి కొద్దిపాటి పెట్టుబడితో 10 ఏళ్ల కాలంలో మంచి ఆదాయం పొందే పంటగా చెప్పవచ్చు.