Mysaa: “మైసా” మొదలయ్యింది.. గోండు బిడ్డగా రష్మిక విశ్వరూపం..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుసగా క్రేజీ సినిమాలు చేస్తోంది. త్వరలో ఆమె (Mysaa)ప్రధాన పాత్రలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదల కానుంది. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్న ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు.

Mysaa: “మైసా” మొదలయ్యింది.. గోండు బిడ్డగా రష్మిక విశ్వరూపం..

Rashmika Mandanna Mysaa movie regular shooting has started

Updated On : November 3, 2025 / 6:22 PM IST

Mysaa: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుసగా క్రేజీ సినిమాలు చేస్తోంది. త్వరలో ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదల కానుంది. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్న ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును మొదలుపెట్టింది రష్మిక. అదే మైసా. ఈ సినిమాలో గోండ్‌ గిరిజన మహిళగా కనిపించనుంది. దీనికి సంబందించిన పోస్టర్ కూడా ఇప్పటికే విడుదల చేశారు మేకర్స్.(Mysaa) మొహానికి రక్తంతో చేతిలో బల్లెం పట్టుకొని చాలా పవర్ ఫుల్ గా ఉన్న రష్మిక పోస్టర్ ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది.

Alpha: వార్ 2 ఎఫక్ట్.. ఆలోచనల్లో పడ్డ నిర్మాత.. దెబ్బకు సినిమా వాయిదా వేశారుగా..

ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు మేకర్స్. కేరళలోని అథిరప్పిల్లీలో ఈ షూటింగ్ మొదలయ్యింది. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రవీంద్ర పుల్లే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవ్వనున్నాడు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ రెండు ఒకే టైంలో పూర్తి చేసి అతి త్వరగా సినిమాను విడుదల చేయాలనీ చూస్తున్నారు మేకర్స్. ఇటీవలి కాలంలో చాలా సినిమాలకు తన అద్భుతమైన మ్యూజిక్ తో ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్న జాక్స్ బెజోయ్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక పుష్ప 2లో విలన్ గా నటించిన తారక్ ఈ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు.