Alpha: వార్ 2 ఎఫక్ట్.. ఆలోచనల్లో పడ్డ నిర్మాత.. దెబ్బకు సినిమా వాయిదా వేశారుగా..

యాష్ రాజ్ ఫిలిమ్స్.. బాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ కంపెనీ. ఈ సంస్థలో తప్పకుండా సినిమా చేయాలనీ ప్రతీ స్టార్ హీరో(Alpha) అనుకుంటారు. ఆలాగే, ఈ సంస్థ నుంచి వచ్చే సినిమాలపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.

Alpha: వార్ 2 ఎఫక్ట్.. ఆలోచనల్లో పడ్డ నిర్మాత.. దెబ్బకు సినిమా వాయిదా వేశారుగా..

Yash Rash Productions postpones Alpha release due to War 2 results

Updated On : November 3, 2025 / 5:06 PM IST

Alpha: యాష్ రాజ్ ఫిలిమ్స్.. బాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ కంపెనీ. ఈ సంస్థలో తప్పకుండా సినిమా చేయాలనీ ప్రతీ స్టార్ హీరో అనుకుంటారు. ఆలాగే, ఈ సంస్థ నుంచి వచ్చే సినిమాలపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అయితే, ఈ సంస్థ స్పై యూనివర్స్ ను క్రియేట్ చేసింది విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ యూనివర్స్ నుంచి పఠాన్, టైగర్, వార్, వార్ 2 లాంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యూనివర్స్ నుంచి వస్తున్న మూవీ ఆల్ఫా. ఆలియా భట్, శార్వరి హీరోయిన్స్ గా వస్తున్న ఈ సినిమాను శివ రవాయిల్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sudheer Babu: కృష్ణ, మహేష్ వల్ల జరిగిందే అదే.. మిగతావి నా కష్టం.. ఇలా చెప్పాలంటే గట్స్ కావాలి..

ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, తాజా సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా పడింది. ఈమేరకు మేకర్స్ కూడా అధికారిక ప్రకటన చేశారు. దీనికి కారణం ఏంటంటే, రీసెంట్ ఈ యూనివర్స్ నుంచి వచ్చిన వార్ 2. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. కానీ, దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. దీంతో, యాష్ రాజ్ సంస్థ ఆల్ఫా మూవీ విడుదల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట.

వార్ 2పై క్రియేట్ అయినా నెగిటీవ్ ఇంపాక్ట్ ఇంకా తగ్గలేదు. ఓటీటీలో విడుదల అయ్యాక ఇంకా ఎక్కువగా జరిగింది. కాబట్టి, ఆల్ఫా సినిమాను ఇదే ఇయర్ లో విడుదల చేస్తే ఈ ఇంపాక్ట్ ఈ సినిమాపై కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, సినిమాను వచ్చే ఏడాదికి పోస్ట్ పోనే చేస్తూ అధికారిక ప్రకటన చేశారు. ఈలోగా సినిమాలో సీజీ వర్క్ ఇంకాస్త మెరుగ్గా చేయడానికి సమయం కూడా దొరుకుతుంది అని ఆలోచించిన మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారట. ఈ విషయంలోను ఆడియన్స్ నుంచి ట్రోలింగ్ రాకూడని, సినిమా పక్కా హిట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక కొత్త రిలీజ్ డేట్ ప్రకారం ఆల్ఫా సినిమా 2026 ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మార్చిన రిలీజ్ డేట్ ఆల్ఫా సినిమా రిజల్ట్ ను మారుస్తుందా అనేది చూడాలి.