Cucumber Crop : దోసతోటలో బోరాన్ లోపం నివారణ

ముఖ్యంగా బోరాన్ లోపం తో పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తరువాత తీగలు 4 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే రైతులు జాగ్రత్త పడి నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

Cucumber Crop : దోసతోటలో బోరాన్ లోపం నివారణ

Boron in vegetables

Cucumber Crop : ప్రపంచ దేశాలలో ఎంతో ఆరోగ్యవంతమైనదిగా కొనియాడబడుతున్న దోస, వేసవిలోనే కాకుండా అన్ని కాలాల్లో సాగుచేస్తున్నారు రైతులు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయ పంటలు విస్తీరంగా సాగుచేస్తుంటారు. ముఖ్యగా తీగజాతి పంటైన కూరదోస మంచి ప్రాచూర్యం పొందిన పంట. ఈ పంటకు అనేక రకాల పోషకాల సమస్యలు ఉన్నప్పటికీ అధికంగా బోరాన్ లోపం పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

READ ALSO : Mixed Farming : రైతుకు భరోసానిస్తున్న మిశ్రమ వ్యవసాయం.. పలు పంటల సాగు విధానంతో స్థిరమైన ఆర్థిక వృద్ధి

ప్రస్తుతం పూత , పిందె దశలలో ఉన్న ఈ పంటకు బోరాన్ లోపం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తించిన వెంటనే రైతులు సరైన యాజమాన్యం చేపడితే బోరాన్ లోపాన్ని నివారించి నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేందుకు ఆస్కారముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కేవలం ఒక ప్రత్యేక నేల అని కాకుండా ఎటువంటి నేలలోనైనా విరివిగా పెరుగుతుంది. అతితక్కువ సమయంలో చేతికి వచ్చే ఈ పంటకు పోషకాల లోపం చాలా వరకు ఉంటుంది. రైతులు రసాయన ఎరువులను మాత్రమే అందిస్తూ ,సూక్ష్మపోషకాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో పోషకాల లోపం ఏర్పడుతుంది.

READ ALSO : Watermelon : పుచ్చసాగులో తెగుళ్ళు,చీడపీడల నివారణ!

ముఖ్యంగా బోరాన్ లోపం తో పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తరువాత తీగలు 4 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే రైతులు జాగ్రత్త పడి నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

దోసలో సమగ్ర ఎరువుల యాజమాన్య చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చు. ఎకరాకు రెండున్నర కిలోల యూరియా, రెండు కిలోల పొటాష్ ఎరువులను 15 విడుతలుగా 45 రోజుల వరకు వేస్తుండాలి. ఆ తరువాత 2 కిలోల యూరియా, 3 కిలోల పొటాష్ ఎరువును నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా అందించాలి .

READ ALSO : Guava : జామతోటల్లో చీడపీడలు నివారణ

పూత, పిందె ప్రారంభమైన తరువాత మల్టికె-10 లేదా 0.5 మిల్లీ లీటర్ల స్కోర్‌ను లీటరు నీటికి కలిపి 2-3 సార్లు పిచికారీ చేస్తే నాణ్యమైన మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. రాంప్రసాద్ చెబుతున్నారు.