Climate Agriculture : శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ అధారిత వ్యవసాయ సూచనలు
నువ్వుల పంటలో రసంపీల్చే పురుగుల నివారణకు ఎసిఫేట్ 1 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నానుడికుళ్లు తెగులు నివారణకు మ్యాంకోజెబ్ 3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Climate Agriculture
Climate Agriculture : రైతులు తమ పొలంలో వివిధ రకాల పంటలను సాగుచేస్తుంటారు. వాతావరణ పరిస్ధితులు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దీని వల్ల చీడపీడలు ఆశించి పంటకు తీవ్రనష్టం కలుగుతుంది. ఎంతో శ్రమకోర్చి, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన రైతులకు చివరకు కన్నీరు మిగులుతుంది. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించే సూచనలు, సలహాలు పాటిస్తూ సకాలంలో పంటల యాజమాన్య పద్దతు పాటిస్తే చీడపీడల నుండి పంటలను కాపాడుకోవటంతోపాటు మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. వివిధ పంటలకు సంబంధించి వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న కొన్ని సూచనలు , సలహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతొలుచు పురుగు, సుడిదోమ ఉధృతి… నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు
1. వరిలో జాగ్రత్తలు ;
వరిసాగు చేసే రైతులు వరిగట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్లమీద ఉండే కలుపు మొక్కలపైనే కాండం తొలుచుపురుగు , అగ్గితెగులు నివసించి వరిపంటను ఆశించే ప్రమాదం ఉంది. సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగు నీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రెలు వచ్చే వరకు ఆరగట్టి మళ్లీ నీరివ్వాలి.
వరిలో కాండంతొలుచు పురుగు నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో క్లోరాంట్రినిలిప్రోల్ 0.3 మి. లీ. లేదా టెట్రానిలిప్రోల్ 0.5 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో అగ్గితెగులు గమనించడమైనది. నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథైమోలిన్ 1.5 మి. లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
READ ALSO : Boron Deficiency : కొబ్బరి సాగులో బోరాన్ లోపం, నివారణ మార్గాలు!
ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు డైకోఫాల్ 5 మి. లీ. లేదా స్పైరోమేసిఫిన్ 1 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వరిలో అక్కడక్కడ పాము పొడతెగులు గమనించడమైనది . నివారణకు హెక్సాకొనజోల్ 2 మి. లీ. లేదా ప్రోపికొనజోల్ 1 మి. లీ. లేదా టెబుకొనజోల్ 0.4 గ్రా. + ట్రెస్లోక్సీస్ట్రోబిన్ 75 డబ్ల్యు జి మందును లీటరు నీటికి కలిపి కాండం మొదలు తడిచేలా పిచికారి చేయాలి.
2. మొక్కజొన్నలో జాగ్రత్తలు ;
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మొక్కజొన్నలో కాండంకుళ్లు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు కార్బండిజమ్ 1 గ్రా. లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచేట్లు పిచికారి చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు క్లోరాంట్రినిలిప్రోల్ 0.4 మి. లీ. లేదా స్పైనటోరం 0.5 మి. లీ మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారి చేయాలి.
READ ALSO : Diseases Of Groundnut : వేరుశనగలో మొవ్వకుళ్ళు వైరస్ తెగులు నివారణ!
3. వేరుశనగలో జాగ్రత్తలు ;
వేరుశనగలో కాండం కుళ్లు తెగులు గమనించడమూనది. నివారణకు కార్బండిజమ్ 2.5 గ్రా. + మ్యాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వేరుశనగలో టిక్కాఆకుమచ్చ తెగులు గమనించడమైనది. దీని నివారణకు టెబ్యుకోనజోల్ 1 మి. లీ లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రా. మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. చాలా చోట్ల మొవ్వుకుళ్లు వైరస్ తెగులు సోకింది. నివారణకు థయోమిథాక్సామ్ 0.5 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పొలం గట్లమీద ఉన్న వయ్యారిభామ కలుపును తీసివేయాలి.
4. ఆముదంలో జాగ్రత్తలు ;
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆముదంలో రసంపీల్చే పురుగులు గమనించడమైనది. నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి. లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా క్లోథయానిడిన్ 0.1 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఆముదంలో పొగాకు లద్దెపురుగు గమనించడమైనది. నివారణకు ఫ్లూబెండమైడ్ 0.2 మి. లీ. లేదా నోవాల్యూరాన్ 1 మి. లీ. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి. లీ. మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
READ ALSO : Castor Bean Crop : ఆముదం పంటకు నష్టం కలిగించే ఎర్రగొంగళి పురుగు, నివారణ చర్యలు
5. పెసర, మినుములో జాగ్రత్తలు ;
పెసర, మినుములు పంటలు 35 రోజుల దశలో ఉన్నప్పుడు వేపసంబందిత మందులు పిచికారి చేసినట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. మినుములో తామరపురుగు నివారణకు ఎసిఫేట్ 1 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి. లీ. లేదా డైమిథోయేట్ 2 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయతొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లైతే ఫ్లూబెండమైడ్ 0.2 మి. లీ. లేదా క్లోరాంట్రినిలిప్రోల్ 0.3 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
6. నువ్వుల పంటలో జాగ్రత్తలు ;
నువ్వుల పంటలో రసంపీల్చే పురుగుల నివారణకు ఎసిఫేట్ 1 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నానుడికుళ్లు తెగులు నివారణకు మ్యాంకోజెబ్ 3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
READ ALSO : Mango Farming : మామిడిలో కాయ,పిందె దశలో చేపట్టాల్సిన యాజమాన్యచర్యలు!
7. వంగలో జాగ్రత్తలు ;
వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగులను గమనించడమైనది. నివారణకు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగుల ఉధృతిని పర్యవేక్షించాలి. పురుగులు సోకిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి.
8. మామిడిలో జాగ్రత్తలు ;
పూతదశలో ఉన్న మామిడి తోటల్లో చీడపీడలు, తెగుళ్లు నివారణకు పురుగు మందులను ఉదయం 11 గంట తరువాత మాత్రమే పిచికారి చేయాలి. అందువలన పరాగ సమపర్కమునకు ఇబ్బంది కలుగకుండా కాయలు ఏర్పడుతాయి. పిందె దశలో ఉన్న మామిడి తోటలకు నేల స్వభావం బట్టి నీటి తడులు ఇవ్వాలి. మామిడిలో పండుఈగ నివారణకు పిందె దశ నుండే పండుఈగ ఆకర్షక బుట్టలు ఎకరానికి 10 నుండి 20 చొప్పున అమర్చుకోవాలి.
READ ALSO : Sunflower Seed Production : రైతులకు ఆశాజనకంగా పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి !
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మామిడిలో తామరపురుగులు ఆశించుటకు అనుకూలం . నివారణకు ఫిప్రోనిల్ 2 మి. లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మామిడిలో తేనెమంచు పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు పూమొగ్గ దశలో ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి. లీ. లేదా థయోమిథాక్సామ్ 0.3 గ్రా. లేదా డైమిథోయేట్ 2 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.