Cotton and Soya Crops
Cotton And Soya Crops : తెలంగాణలో పత్తి, సోయా పంటలు పూత దశనుండి కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు రెండో దఫా ఎరువులను వేయలేకపోతున్నారు. ఎరువులు, సూక్ష్మపోషకాలు అందించకపోతే మొక్క ఎదుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో ఎలాంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రఘువీర్.
Read Also : Safflower : అధిక దిగుబడినిచ్చే కుసుమ రకాలు.. సాగు యాజమాన్యం
ఈ ఏడాది రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో.. పత్తి, సోయా పంటల సాగుకూడా అలస్యమైంది. చాలా వరకు మొదటి దఫా ఎరువులను కూడా వేశారు. అయితే కొంత బెట్ట వాతావరణ పరిస్థితుల తరువాత.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటకు మేలు చేస్తున్నాయి.
అయితే, పంట చేలన్నీ తడిగా ఉండటం.. వర్షపు జల్లులు పడుతుండటంతో సూక్ష్మపోషకాల లోపం ఎర్పడుతుంది. ఈ నేపధ్యంలో పత్తి, సోయాపంటల్లో ఎరువుల యాజమాన్యం ఏవిధంగా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రఘువీర్.
Read Also : Papaya Cultivation : బొప్పాయి పాలతో ఔషదాల తయారీ.. అదనంగా ఆదాయం వస్తోందంటున్న రైతులు