Papaya Cultivation : బొప్పాయి పాలతో ఔషదాల తయారీ.. అదనంగా ఆదాయం వస్తోందంటున్న రైతులు

Papaya Cultivation : సాధారణంగా బొప్పాయి తోటలు అనగానే మనకు బొప్పాయి కాయలే గుర్తుకు వస్తాయి. అందులో మరో కోణం దాగి ఉంది. బొప్పాయి కాయలు తినడానికే  కాకుండా బొప్పాయి పాలకు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.

Papaya Cultivation : బొప్పాయి పాలతో ఔషదాల తయారీ.. అదనంగా ఆదాయం వస్తోందంటున్న రైతులు

Papaya Cultivation

Updated On : September 29, 2024 / 2:59 PM IST

Papaya Cultivation : బొప్పాయి.. ఈ కాయలకి పాలు కారతాయని తెలుసు. కానీ ఆ పాలతో మందులు, సౌందర్యక్రీములు తయారు చేస్తారని ఎవరికైనా తెలుసా.. అందుకే బొప్పయి పాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. దీన్నే ఆసరాగా చేసుకొని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు చివరిదశలో ఉన్న బొప్పాయి తోటను పాలకోసం అమ్మి అదనపు ఆదాయం పొందుతున్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

సాధారణంగా బొప్పాయి తోటలు అనగానే మనకు బొప్పాయి కాయలే గుర్తుకు వస్తాయి. అయితే అందులో మరో కోణం దాగి ఉంది. బొప్పాయి కాయలు తినడానికే  కాకుండా బొప్పాయి పాలకు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.  మందుల తయారీలో ఈ పాలను అధికంగా వినియోగిస్తారు .

అందుకే చాలా మంది రైతులు బోప్పాయి పంట చివరి దశలో అంటే 500 గ్రాముల బరువు కంటే తక్కువ సైజులో ఉన్న సమయంలో తోటలను తీసివేస్తుంటారు. కానీ నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, పొంగూరు గ్రామానికి చెందిన రైతు నాగరాజు రెడ్డి తనకున్న 15 ఎకరాల బొప్పడి తోట చివరి దశలో ఉండటం… పాలు సేకరించే కాంట్రాక్టర్లకు అమ్ముకొని అదనపు ఆదాయం పొందుతున్నారు.

బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం తెల్లవారు జాము నుండి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో కూలీలు సేకరిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా బొప్పాయిచెట్టు కింద చెట్టు చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌తో తయారు చేసిన ఓ జల్లెడలాంటి అట్టను కింద ఉంచుతారు. ముళ్ల కంప లాంటి వస్తువుతో ముందుగా బొప్పాయి కాయలపై గాట్లు వేస్తారు.

కాయల నుంచి కారే పాలన్నీ కింద ఉన్న ప్లాస్టిక్‌ సంచుల్లో పడతాయి. పాలు కింద పడిన కొద్దిసేపటికే  అవి గడ్డగా మారిపోతాయి. పాలధార నిలిచిపోయిన తరువాత గడ్డగా మారిన పాలను ప్లాస్టిక్‌ క్యాన్లలో నింపుతారు.  పాలసేకరణ కోసం కాంట్రాక్టర్లు ఎకరం బొప్పాయి తోటలకు రూ. 20 వేలు వరకు చెల్లిస్తుంటారు. పాలసేకరణ ముగిసిన తరువాత తోటల్లో మిగిలిన పచ్చికాయలను స్వీట్లు, బ్రెడ్లు, కేక్‌ల తయారీలో వినియోగించే స్వీట్‌ చిప్స్‌ను తయారు చేస్తారు.

Read Also : Safflower : అధిక దిగుబడినిచ్చే కుసుమ రకాలు.. సాగు యాజమాన్యం