Safflower : అధిక దిగుబడినిచ్చే కుసుమ రకాలు.. సాగు యాజమాన్యం

Safflower Farming : ఇటీవలికాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో ఇప్పుడిప్పుడే సాగు విస్తీర్ణం పెరుగుతుంది.

Safflower : అధిక దిగుబడినిచ్చే కుసుమ రకాలు.. సాగు యాజమాన్యం

high yielding varieties of safflower farming techniques

Updated On : September 29, 2024 / 2:51 PM IST

Safflower : నూనెగింజ పంటల్లో విశిష్ఠ ప్రాధాన్యత కలిగిన పంట కుసుమ. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 వేల ఎకరాల్లో సాగవుతుంది ఈ పంటలో ఆదాయం తక్కువగా వుండటం,  మొక్కకు ముళ్లు అధికంగా వుండటం, పంట కోతకు కూలీలు దొరకక పోవటం వల్ల క్రమేపి దీని సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

అయితే, ఇటీవలికాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో ఇప్పుడిప్పుడే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అయితే కుసుమను సాగుచేసే రైతులు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం…

నూనెగింజ పంటల్లో బహుళ ప్రయోజనాలతో ఆకర్షిస్తున్న పంట కుసుమ. దీని  ఆకులు వాడిగా ఉన్న ముళ్లను కలిగి ఉంటాయి. పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి.  ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు 20 నుండి 25 హెక్టార్లలో సాగవుతుంది. తెలంగాణలో 15 వేల నుండి 20 వేల ఎకరాల్లో సాగవుతుంది. ఈ పంటసాగుకు సెప్టెంబరు మొదటి పక్షం నుంచి అక్టోబరు వరకు అనుకూలమైన సమయం.

ఆలస్యమైనప్పుడు నవంబరు 15 వరకు కూడా విత్తుకునే అవకాశం వుంది. సాగుచేసిన రకాన్నిబట్టి కుసుమ పంటకాలం 120 నుంచి 135రోజుల వరకు వుంటుంది. గతంలో ఎకరాకు 3,4 క్వింటాళ్ల దిగుబడి రావటం కష్టంగా వుండేది. కానీ ప్రస్థుతం అభివృద్ధిచెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. అయితే సాగు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, చింతపల్లి మండలం వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డా. టి . అనురాధ.

ఆరోగ్యపరంగా కుసుమ నూనె వాడకం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగులు, చిన్నారులు, ఎముకల వ్యాధిగ్రస్తులకు ఈ నూనె స్వస్థత చేకూరుస్తుంది. అంతే కాదు కుసుమ పువ్వుల నుండి సేకరీంచే పూరెక్కల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు , వస్త్రాలలో అద్దకపు రంగుగా విరివిగా వాడుతున్నారు. ఇప్పుడు టీలలో కూడా వినియోగిస్తున్నారు. అందువల్ల పూరెక్కలకు సేకరించి మార్కెట్ చేస్తే రైతుకు అదనపు రాబడి లాభస్తుంది.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు