Pink Worm Prevention : పత్తికి గులాబి రంగు పురుగు బెడద.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

గులాబి రంగు కాయ తొలుచు పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు , నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు పత్తి పంటలో శిలీంధ్రపు బూజుతెగుళ్లు ఆశిస్తుంటాయి.

Pink Worm Prevention : మూడేళ్లుగా పత్తి పంటకు  గులాబి రంగు పురుగు ప్రమాదకరంగా మారింది. పత్తిలో బీటీ రకాల రాకతో కాయతొలుచు పురుగుల బెడద తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్న రైతులకు ప్రస్తుతం ఈ పురుగు వణుకు పుట్టిస్తోంది. పంట దిగుబడిని, నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రస్తుతం  పూత, కాత దశలో ఉన్న పత్తిలో ఈ పురుగు అనేకచోట్ల కనిపిస్తోంది. మరోవైపు సెప్టెంబర్ లో వరుసగా కురిసిన వర్షాలకు శిలీంధ్రపు బూజుతెగుళ్లు ఆశించాయి. వీటి ఉధృతి పెరగకముందే, మొదట్లోనే తేలికపాటి యాజమాన్య చర్యలు చేపట్టి నివారించ వచ్చంటున్నారు కరీంనగర్ జిల్లా  జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డా. శ్రీనివాస రెడ్డి .

READ ALSO : RTC Driver : సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం

తెల్ల బంగారంగా పిలవబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తారు.  ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు సాగుచేస్తున్నారు.  అయితే గత 3 సంవత్సరాల నుండి రైతులకు గులాబిరంగు గుబులు పుట్టిస్తుంది.  దీనివల్ల  జరిగే నష్టం పైకి కనపడదు. పూంట పూత, కాత దశలో చిన్న లార్వాలు మెగ్గలపై లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవిత కాలం మొత్తం కాయలలోనే గడుపుతాయి.

READ ALSO : Narne Nithin : ఎన్టీఆర్ బావ నాకు అదొక్కటే చెప్పాడు..

లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వులలోని పదార్ధాలను తినడం వలన ఆకర్షక పత్రాలు విప్పుకోకుండా ముడుచుకొని ఉంటాయి. వీటిని గుడ్డిపూలు అంటారు. ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకోనప్పటికీ లోపల అండాశయాలను పుప్పొడిని తినడం వలన నష్టం కలుగుతుంది. పంట తొలిదశలో ఆశిస్తే మొగ్గలు, పూలు  రాలిపోతాయి. లేత కాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం కాని, కాయ పరిమాణం పెరగకపోవడం , కాయలు సరిగ్గా పగలక ఎండిపోయి గుడ్డి పత్తి ఏర్పడటం జరుగుతుంది.

READ ALSO : Mumbai : నరేంద్ర మోడీతో ఫోన్ చేయించనా? అంటూ..మద్యంతాగి బైక్ నడుపుతూ మహిళ వీరంగం

గులాబి రంగు కాయ తొలుచు పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు , నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు పత్తి పంటలో శిలీంధ్రపు బూజుతెగుళ్లు ఆశిస్తుంటాయి. ప్రధానంగా వీటిలో ఆకుమచ్చ, వేరుకుళ్లు, ఎండుతెగులు లాంటి పలు రకాల తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.ఈ పురుగును  గుర్తించినట్లైతే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించ వచ్చంటున్నారు కరీంనగర్ జిల్లా  జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డా. శ్రీనివాస రెడ్డి .

READ ALSO : Massive Traffic in Bengaluru : ఒక కిలోమీటర్ ప్రయాణానికి 2 గంటల సమయం…భారీ ట్రాఫిక్‌తో రాత్రికి ఇంటికి చేరిన పాఠశాల విద్యార్థులు

బీటీ పత్తి చుట్టు రెఫ్యూజీ క్రాప్ వేయకపోవడంచేతనే గులాబిరంగు పురుగు ఉధృతి పెరిగి రైతులకు తీవ్రనష్టం కలిగిస్తోంది. మరో వైపు పురుగు ఆశించిన మొదటి దశలోనే చాలా మంది రైతులు సింథటిక్ పూథ్రాయిడ్స్ మందులను పిచికారి చేస్తున్నారు. దీంతో గులాబి రంగు పురుగు నాశనమైనా, ఆతరువాత పచ్చదోమ, తెల్లదోమ ఆశించే ప్రమాదం ఏర్పడుతోంది. కాబట్టి రైతులు నిర్దేశించిన పురుగు మందులను, చివరి దశలో మాత్రమే పిచికారి చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు