RTC Driver : సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం

బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

RTC Driver : సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం

RTC driver cell phone driving

RTC Driver Driving – Watching Cell Phone : సాధారణంగా మద్యం తాగి, సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయరాదని సూచనలు ఉంటాయి. కానీ, కొంత మంది డ్రైవర్లు దీన్ని పట్టించుకోవడం లేదు. మద్యం తాగి, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ, సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. తాజాగా టీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు. సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు.

ఖమ్మం జిల్లాలో టీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడారు. సెల్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపారు. కొత్తగూడెం డిపోకు చెందిన TS28TA2588 నెంబర్ గల ఆర్టీసి బస్సు కొత్తగూడెం నుండి సత్తుపల్లికి వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ 10 నిమిషాలకు పైగా మొబైల్ లో వీడియోస్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు.

TSRTC : టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రాయితీ

డ్రైవర్ సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.  బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.