Massive Traffic in Bengaluru : ఒక కిలోమీటర్ ప్రయాణానికి 2 గంటల సమయం…భారీ ట్రాఫిక్‌తో రాత్రికి ఇంటికి చేరిన పాఠశాల విద్యార్థులు

కేవలం ఒక కిలోమీటరు దూరం ప్రయాణానికి రెండు గంటల సమయం పట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తాజాగా వెలుగుచూసింది. బెంగళూరులో బుధవారం అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ వల్ల నగర ప్రజలు అవస్థలు పడ్డారు. పెరిగిన వాహనాల రద్దీతో వాహనచోదకులు పలు ఇక్కట్లు పడ్డారు....

Massive Traffic in Bengaluru : ఒక కిలోమీటర్ ప్రయాణానికి 2 గంటల సమయం…భారీ ట్రాఫిక్‌తో రాత్రికి ఇంటికి చేరిన పాఠశాల విద్యార్థులు

Massive Traffic in Bengaluru

Massive Traffic in Bengaluru : కేవలం ఒక కిలోమీటరు దూరం ప్రయాణానికి రెండు గంటల సమయం పట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తాజాగా వెలుగుచూసింది. ( 1 km in 2 hours) బెంగళూరులో బుధవారం అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ వల్ల నగర ప్రజలు అవస్థలు పడ్డారు. పెరిగిన వాహనాల రద్దీతో వాహనచోదకులు పలు ఇక్కట్లు పడ్డారు. (Massive traffic in Bengaluru) బెంగళూరు నగరంలో బుధవారం వేలాది వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోయాయి. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాంతం భారీ ట్రాఫిక్ తో అత్యంత అధ్వానంగా మారింది.

ట్రాఫిక్ జామ్…రోడ్లపైకి రావద్దని ట్రాఫిక్ పోలీసుల సూచన

వాహనచోదకులు ఐదు గంటలకు పైగా రోడ్లపైనే ఉండిపోయారు. కర్ణాటక జల సంరక్షణ సమితి’ పిలుపునిచ్చిన బెంగళూరు బంద్ తర్వాత ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. చాలా మంది వాహనచోదకులు తమ కార్యాలయాలకు లేదా ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ట్రాఫిక్ జామ్ తో ప్రజలు రాత్రి 9 గంటలలోపు కార్యాలయం నుంచి బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ రద్దీతో ఓఆర్ఆర్, మారతహళ్లి, సర్జాపుర, సిల్క్‌బోర్డ్ మార్గాల్లో ప్రయాణించవద్దని ఉపయోగించవద్దని పోలీసులు సలహా ఇచ్చారు.

కిలోమీటరున్నర దూరం ప్రయాణానికి 3 గంటల సమయం

ఒక కిలోమీటర్ ప్రయాణానికి 2 గంటల సమయం పట్టిందని ఓ వాహనచోదకుడు చెప్పారు. కిలోమీటరున్నర ప్రయాణానికి మూడు గంటల సమయం పట్టిందని మరో డ్రైవర్ చెప్పారు. బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ కారణంగా పాఠశాల బస్సు రాత్రి 8 గంటలకు పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి దింపిందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. (school kids reach home at night) ట్రాఫిక్ అవస్థలపై పలువురు వాహనచోదకులు ఎక్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫుట్‌పాత్‌పై ఇరువైపులా ద్విచక్ర వాహనాలు…

‘‘బెంగళూరులో బుధవారం భయంకరమైన ట్రాఫిక్… ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి రావడానికి 5 గంటల సమయం పట్టింది. బెంగుళూరు ట్రాఫిక్ పీక్‌లో ఉంది’’ అని ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు. ‘‘బెళ్లందూరు వద్ద ట్రాఫిక్ రద్దీ కారణంగా పాదచారులకు చోటు లేకుండా పోయింది. ఫుట్‌పాత్‌పై ఇరువైపులా ద్విచక్ర వాహనాలు తిరుగుతున్నాయి. బైకర్లకు జరిమానా విధించేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?’’ అని పాదచారుల కోసం వాక్‌వేపై ద్విచక్ర వాహనాలు కదులుతున్న వీడియోను షేర్ చేస్తూ ఒక వినియోగదారు ప్రశ్నించారు.

కామెడీ షో రద్దు

బెంగళూరులో బుధవారం అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ వల్ల హాస్యనటుడు ట్రెవర్ నోహ్ బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో జరగాల్సిన ప్రదర్శనను రద్దు చేశారు. ట్రెవర్ నోహ్ తన గమ్యాన్ని చేరుకోవడానికి 30 నిమిషాలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. బుధవారం రోజు రాత్రి 7:30 గంటల వరకు 3.59 లక్షల వాహనాలు తిరిగాయి. వర్షం కారణంగా అనేక అంతర్గత రహదారుల వద్ద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్ కు కూడా కారణమైంది. మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల మధ్య పలు వాహనాలు నీట మునిగాయి. దీనికి తోడు బెంగళూరు నగరంలోని చాలా ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన ఊరేగింపులు జరగడంతో రోడ్లపై రద్దీ ఏర్పడింది.